Ads
ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ కి గట్టి పోటీ ఇచ్చింది గృహలక్ష్మి సీరియల్. కానీ ఇప్పుడు మాత్రం గృహలక్ష్మి సీరియల్ కూలబడిపోయింది. టిఆర్పి రేటింగ్ లో మూడో ప్లేస్ కి వెళ్ళిపోయింది. గృహలక్ష్మి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో బ్రహ్మముడి, కృష్ణ ముకుందా మురారి ఉన్నాయి. ఆ తర్వాత మూడవ ప్లేస్ లో గుప్పెడంత మనసు ఉంది. గృహలక్ష్మి మాత్రం ఘోరమైన పరిస్థితిలో ఉంది. కథ మొత్తాన్ని కూడా మార్చేశారు.
Video Advertisement
తులసి కూతురు దివ్యని లీడ్ రూల్ కింద మార్చేసి విక్రమ్ ని తీసుకువచ్చి కథనాన్ని మార్చేశారు కొత్త కొత్త క్యారెక్టర్లని కూడా తీసుకువచ్చారు.
తులసి భజన మేళం సామ్రాట్, శృతి, ప్రేమ్, అంకిత, అభి, పరంధామయ్య, అనసూయని సైడ్ చేసేసారు. తులసి పాత్రను తీసేస్తే సీరియల్ బాగుపడుతుందని అంతా భావిస్తున్నారు. నిజంగా ఆ పాత్ర ఇప్పుడు పెద్ద నస కింద తయారయింది. త్వరలో తులసి పాత్రని తీసేస్తారేమో చూడాలి. ఈ సీరియల్ నుండి ఒక్కొక్కళ్ళు తప్పిస్తున్నారు. ఇంచరా శెట్టి అనే ఒక అమ్మాయి దివ్య పాత్రలో వచ్చేసింది. ఆ పాత్రలో ఉన్న పూజిత రెడ్డిని తప్పించారు. అభి అంకితలని అమెరికా పంపించేశారు. వాళ్లు కూడా ఇప్పుడు కనబడడం లేదు. ప్రేమ్, శృతి కూడా సీరియల్ లో పెద్దగా కనబడడం లేదు.
ఇలా చాలామంది నటులు పెద్ద మైనస్ కింద అయిపోయారు. శృతి పాత్ర చేస్తున్న లహరికి గీతాంజలి సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఈ సోమవారం నుండి ఆ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. కనుక శృతి గృహలక్ష్మి లో కనపడటం కష్టం. ఇంద్రనీల్ కూడా ఈ సీరియల్ కి వచ్చే తన ఫేమ్ ని తగ్గించుకున్నాడు. ఈ సీరియల్ లో తులసి పాత్ర చేస్తున్న కస్తూరికి నటన మీద అనుభవం ఎక్కువే. మంచిగానే నటిస్తూ ఉంటుంది. కానీ ఆమె నటన ఇప్పుడు కాస్త వెనుక పడింది.
ఆమె ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో తెలియడం లేదు. చిత్ర విచిత్రంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతోంది. గృహలక్ష్మి కాస్త గందరగోళ లక్ష్మీ కింద తయారయింది. ఇలా తులసి భజన బ్యాచ్ ని పక్కన పెట్టేశారు. అయితే దివ్య వచ్చిన తర్వాత స్టోరీ కూడా మారింది. దివ్య ఇప్పుడు గృహలక్ష్మిగా అయిపోవచ్చు. ఒకవేళ కనుక ఇలా మెల్లగా గృహలక్ష్మిని సైడ్ చేసేస్తే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మళ్లీ బాగుండే అవకాశం ఉంది.
End of Article