బుల్లితెర ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ పెంచిన సీరియల్ కార్తీకదీపం. దీని గురించి తెలియని వారు ఉండరు. అయితే ఇక ఈరోజు అనగా డిసెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం అవుతోంది అనేది చూద్దాం. ఈ ఎపిసోడ్ లో ఏం అవుతుందంటే… అమ్మ నాన్నలు ఎందుకు హైదరాబాద్ వెళ్లడం లేదని ఆలోచిస్తుంది శౌర్య. ఒకవేళ ఉంటే నానమ్మ కూడా అక్కడే ఉండాలి కదా అని అనుకుంటుంది.

Video Advertisement

కార్తీక్ రాసిచ్చిన స్లిప్ ని చూసి అమ్మానాన్నలు బతికే వున్నారని అనుకుంటుంది. బాబాయ్ అన్నట్టుగా అన్నాను సో చారుశీల మేడం ఇలా రాసిచ్చిందా అని ఆలోచిస్తుంది.

ఇంతలో చంద్రమ్మ వస్తుంది. సౌర్య డల్ గా మాట్లాడుతుంది. అమ్మానాన్నలు లేరా అని అంటుంది. చంద్రమ్మ ఉన్న వాళ్ళని లేరని అంటే అంతకంటే పాపం ఇంకోటి ఉండదని అనుకుంటుంది. నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు కదా అలానే ఉందని అంటుంది చంద్రమ్మ. తరవాత ఆసుపత్రికి వెళ్దాం బాబాయ్ అని అంటుంది. ఎందుకని అడుగుతాడు. ఈ స్లిప్పు ఇచ్చారు కదా నాన్నే రాసారేమో అని అంటుంది. ఇంద్రుడు రేపు వెళ్దాం అని అంటాడు. ఇప్పుడే వెళ్లాలి బాబాయ్ అని చెబుతుంది. చంద్రమ్మతో ఒక గ్లాసు బియ్యం ఎక్స్ట్రా పెట్టు నాన్న వస్తే తింటారని అంటుంది. ఇంద్రుడు కి ఏం చెప్పాలో తెలియక అన్నం తినేసాక వెళ్దాం అని చెబుతాడు. చారుశీల జరిగినవి తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

కార్తీక్ ఎందుకు అబద్ధం చెప్పాడు.. ఏదోకటి చెయ్యాలి అని చారుశీల ఆలోచనలో పడుతుంది. ఇంకో పక్క సౌందర్య వస్తుంది. ఈ ఊరికి అసలు జీవితంలో వస్తానని అనుకోలేదు అంజి అని అంటుంది. చారుశీల చెప్పిన దాన్ని నిజం చెయ్యాలని ప్రాణం తీసే పనేదో నేనే చేసేయాలని అనుకుంటుంది. పండరి అక్కడికి వస్తాడు. రా అని పిలుస్తుంది. ఏమీ తెలియనట్టు దీప ఎలా ఉందని అడుగుతుంది.
దీపమ్మ ప్రతిక్షణం ఏడుస్తూనే ఉంటోందని అంటాడు.

Karthika deepam serial director

చారుశీల ఇప్పుడు అబద్దం చెప్తుంది. ఈరోజే దీప రిపోర్ట్స్ వచ్చాయి. ఆరోగ్యం బాలేదని అంటుంది. మందులు వాడితే సరిపోతుందని చెబుతుంది. కార్తీక్ సార్ కి చెప్పి ఇప్పించండి అని అంటాడు కానీ తనకి ఈ విషయం తెలీదని.. అబద్ధాలు చెప్పి క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వెయ్యమని పండరీకి ఇస్తుంది. ఇలా దీప కి మందులిచ్చి చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకో పక్క సౌందర్య వాళ్లు చంద్రుడు దగ్గరకి వెళ్తారు. అక్కడ సౌర్య వాళ్ళని చూసి షాక్ అవుతుంది. సౌర్య తనని తీసుకు వెళ్లేందుకు వచ్చారనుకుని నేను రాను రానమ్మ అని గట్టిగా అరుస్తుంది. నేను తీసుకు వెళ్ళడానికి వచ్చానని చెప్పనా అని అంటుంది సౌందర్య.