Ads
ప్రస్తుతం ఇండియాలో వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ ఉంటుంది. అందులోనూ ఇండియన్ టీం ఆడే మ్యాచ్ ల కైతే క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇండియన్ టీం ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శనలు కనబరిచింది.
Video Advertisement
మొన్న పాకిస్తాన్ మీద సాధించిన విజయం గాని, నిన్న బంగ్లాదేశ్ మీద సాధించిన విజయం గాని ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఎక్కడ చూసినా కోహ్లీ సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారు.
రన్ మిషన్ కోహ్లీ బంగ్లాదేశ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అయితే కోహ్లీ చేసిన సెంచరీకి అంపైర్ రిచర్డ్ కేటీలోబోరో సహాయపడ్డారని కోహ్లీ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే… కోహ్లీ 97 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ ఉండగా బంగ్లా బౌలర్ నసుం అహ్మద్ లెగ్ సైడ్ దిస్ గా వైడ్ బాల్ వేశాడు. ఏ తరహా క్రికెట్లో అయినా కూడా దీన్ని వైట్ బాల్ కాదు అనేవారు ఉండరు.
అయితే ఎంపైర్ కెటిలో బోరో మాత్రం ఈ బంతిని వైడ్ బాలుగా ప్రకటించకుండా చూస్తూ ఉండిపోయాడు. బంతి లెగ్ సైడ్ దిశగా వెళ్ళగానే కోహ్లీ అంపైర్ వైపు దీనంగా చూశాడు. దీనిపై ఎంపైర్ చలించిపోయాడో ఏమో కానీ మొత్తానికి వైడ్ ఇవ్వకుండా కోహ్లీ సెంచరీకి పరోక్షంగా తోడ్పడ్డాడు.
అనంతరం ఒక బంతిని వృధా చేసిన కోహ్లీ 42వ ఓవర్ లో మూడో బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేశాడు.అయితే వ్యవహారాన్ని చూసిన చాలా మంది కోహ్లీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఓన్లీ వ్యక్తిగతంగా మైలురాళ్ల కోసం ఆడుతున్నాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
watch video :
Umpire doesn't give wide to virat
Best moment of match. 🤣🔥🔥#INDvsBAN #ViratKohli pic.twitter.com/L621N4ciur— Saurabh Raj (@sraj57454) October 19, 2023
Also Read: ICC WORLD CUP 2023 : “హార్దిక్ పాండ్యా” కి గాయం..! అతని ప్లేస్ లో వస్తున్న ప్లేయర్ ఎవరంటే..?
End of Article