మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచిన ఈ భారతీయ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచిన ఈ భారతీయ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

by Anudeep

Ads

అందాల పోటీలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ పోటీలలో ఏ దేశంలో అందగత్తెలు ఉన్నారనే విషయమై ప్రపంచ దేశాల ప్రజలు చర్చించుకుంటుంటారు. ఈ పోటీలను కూడా టివి లో వీక్షిస్తూ సంతోషిస్తారు. అన్ని పోటీలలో కంటే మిస్ యూనివర్స్ 2021 పోటీ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

Video Advertisement

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మోడల్స్ ఇందులో పాల్గొంటారు. ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మిస్ యూనివర్స్2021 పోటీలలో భారతీయ మహిళ విజయం సాధించింది.

harnaaz 1

దాదాపు 21 సంవత్సరాల తరువాత భారత్ కు మిస్ యూనివర్స్ 2021 టైటిల్ లభించింది. 2000 వ సంవత్సరంలో ఈ టైటిల్ లారాదత్తాకు లభించింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత పంజాబ్ కు చెందిన ఓ అమ్మాయి ఈ టైటిల్ ను గెల్చుకుంది. ఆమె గురించి తెలుసుకుందాం. తన పేరు హర్నాజ్ సంధు. వయసు 21 సంవత్సరాలు. చాలా చిన్న వయసులో.. అంటే 17 ఏళ్ల వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టారు.

harnaaz 2

మోడలింగ్ పై ఆమెకు ఉన్న ఆసక్తే ఈ విజయాన్ని సాధించి పెట్టాయి. ఈ పోటీ ఫైనల్స్ లో పెరుగ్వే, సౌత్ ఆఫ్రికా, ఇండియా దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు మిగిలారు. వీరు ముగ్గురుని నిర్వాహకులు ఒకటే ప్రశ్న అడిగారు. ఒత్తిడిని అధిగమించడానికి అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి..? అని అడగగా.. హర్నాజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

harnaaz 3

అమ్మాయిలు తమ బలాన్ని గుర్తించాలని.. తమని తాము నమ్మకపోవడం వల్లే ఒత్తిడికి గురవుతారని, ఇతరులతో పోల్చుకోవడం మానేస్తే ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకొచ్చారు. మీ జీవితానికి మీరే లీడర్ గా ఉండాలని, ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పుకొచ్చారు. నా జీవితాన్ని నేను ప్రేమిస్తానని.. అందుకే నేను ఇప్పుడు మీ ముందు ఉన్నాను అని కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పారు.

harnaaz 4

హర్నాజ్ సంధు ఇప్పటికే మిస్ ఇండియా పంజాబ్ 2019 , మిస్ దివా 2021 టైటిల్స్ ను కూడా గెల్చుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2019 కాంటెస్ట్ లో కూడా ఆమె టాప్ 12 గా నిలిచారు. బాయ్ జి కుట్టాగే, యారా దియాన్ పో బరన్ వంటి సినిమాల్లో కూడా నటించారు. చిన్నప్పటి నుంచి యోగా అంటే ఇష్టపడే హర్నాజ్ యాక్టింగ్, ట్రావెలింగ్, డాన్స్, గుర్రపు స్వారీ, ఈత ని కూడా అమితంగా ఇష్టపడతారు.


End of Article

You may also like