“ఆండ్రూ సైమండ్స్ – హర్భజన్ సింగ్” మధ్య జరిగిన ఈ గొడవ గురించి తెలుసా.? దానివల్లే అతని కెరీర్ ఆగిపోయింది.!

“ఆండ్రూ సైమండ్స్ – హర్భజన్ సింగ్” మధ్య జరిగిన ఈ గొడవ గురించి తెలుసా.? దానివల్లే అతని కెరీర్ ఆగిపోయింది.!

by Sunku Sravan

Ads

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్, రెండుసార్లు వరల్డ్ కప్ ఆడి విజయం సాధించిన ఆసీస్ జట్టులో కీలక సభ్యుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి కార్ యాక్సిడెంట్ లో కన్నుమూశారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా కోల్పోయిన రెండవ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సైమండ్స్.

Video Advertisement

దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మార్చిలో గుండెపోటుతో మృతి చెందారు. ఇలా ఇద్దరు క్రికెటర్లను ఒకే సంవత్సరంలో ఆస్ట్రేలియా కోల్పోయింది. సైమండ్స్ ఆకస్మిక మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ తో పాటుగా విదేశీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

#1కార్ యాక్సిడెంట్
కిన్స్ ల్యాండ్ రాష్ట్రంలోని ట్రాన్స్ విల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ టైంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారని, ఘటనా స్థలంలోనే సైమండ్స్ మరణించారని పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఆల్ ఈస్ రివర్ బ్రిడ్జ్ దగ్గర్లో ఆయన కారు బోల్తా పడింది. ఈ క్రమంలో ఆయన ప్రాణాలను కాపాడడానికి ఎమర్జెన్సీ సర్వీసులు ప్రయత్నాలు చేసిన తీవ్రంగా గాయాలు కావడంతో మృతిచెందారు. అయితే ఈ ఘటనపై ఫోరెన్సిక్ క్రాస్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే సైమండ్స్ భార్య లారాతో పాటుగా క్లోయి(4) కొడుకు బిల్లీ (2) ఉన్నారు. ఈ ఘటన విన్న ఆయన భార్య లారా మాట్లాడుతూ మేం షాక్ గురయ్యామని.. మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా అని.. ఆయన గొప్ప వ్యక్తి అని ఆయన లక్షణాలన్నీ మా పిల్లలకి వచ్చాయని లారా ఆవేదన వ్యక్తం చేసింది.

#2ఆల్ రౌండర్
రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్.. ఆస్ట్రేలియా జట్టు తరఫున 26 టెస్టుల్లో 1462 పరుగులు చేశాడు.. ఇరవై నాలుగు వికెట్లు తీశాడు. టెస్ట్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ 162.. 198 వన్డేల్లో 6 సెంచరీలు 3 అర్థం సెంచరీలు 5088 పరుగులు సాధించాడు.
14 టీ 20ల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

#3 ప్రపంచ కప్
2003 మరియు 2007లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2సార్లు ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు.

#4ఇంగ్లాండులో జన్మించి ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు
ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్హామ్లో పుట్టిన సైమండ్స్ ఆస్ట్రేలియాలో పెరిగారు. ఆఫ్రో కరీబియన్ నేపథ్యం ఉన్నటువంటి అండ్రు వెస్టిండీస్ లేదా ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడవచ్చు.. కానీ బ్యాగీ గ్రీన్ ధరించాలనే కల కన్నాడు. 2004 సంవత్సరంలో ఆయన కల నిజమైంది.. 2004 మార్చి 8వ తేదీన శ్రీలంక టెస్టుతో ఆయన అరంగేట్రం చేశారు.


End of Article

You may also like