క్రికెట్ లో చాలామందికి తెలియని రూల్ ఇదే…బౌల్ వేస్తున్నప్పుడు ఫీల్డర్లు.?

క్రికెట్ లో చాలామందికి తెలియని రూల్ ఇదే…బౌల్ వేస్తున్నప్పుడు ఫీల్డర్లు.?

by Mohana Priya

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంక క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది అంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.

Video Advertisement

 

అయితే ప్రతి ఆటలో లాగానే క్రికెట్ లో కూడా ఎన్నో రూల్స్ ఉంటాయి. ఆటలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇందాక పైన చెప్పినట్టుగా క్రికెట్ కి మన ప్రపంచంలో మామూలు క్రేజ్ ఉండదు. అందుకే క్రికెట్ కి సంబంధించిన ప్రతి నియమం చాలా మందికి తెలిసే ఉంటుంది. కేవలం టీవీలో ఆటని చూసి ఈ రూల్స్ పై అవగాహన పొందిన వారు చాలా మంది ఉంటారు. కానీ క్రికెట్ లో ఒక రూల్ మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

పిచ్ లో బౌలర్ బంతిని విసిరి అది బ్యాట్స్‌మన్ స్ట్రైక్ చేసేంతవరకు పక్కన ఉన్న ఫీల్డర్స్ కదలకూడదు. సాధారణంగా మనం గ్రౌండ్ లో ఆడినప్పుడు బౌలర్ బాల్ వేస్తున్నప్పుడు కూడా ఫీల్డర్లు కదుల్తూ ఉంటారు. కానీ అలా కదలకూడదు అంట. దానికి కారణం ఏంటంటే, ఫీల్డర్స్ కదిలినప్పుడు వారి కదలికల వల్ల, లేదా వారి నీడ కదలడం వల్ల బ్యాట్స్‌మన్ దృష్టి మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే బాల్ బాట్స్మెన్ ని చేరేవరకు ఫీల్డర్ కదలకూడదు. అందుకే ఫీల్డింగ్ సెట్ చేసుకోడం అనేది బాల్ వేసేముందే చూసుకుంటారు కెప్టెన్ లు.


You may also like