Ads
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కింగ్ కోహ్లీ అని అభిమానులు ముద్దుగా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు. వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్ గా రికార్డ్ సాధించాడు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో తన బ్యాటింగ్ తో విధ్వంసం చూపించాడు. కోహ్లీ పని అయిపోయింది అన్న వారికి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు.
Video Advertisement
అలాగే ప్రకటనల ద్వారా ఎక్కువ మొత్తం ఆదాయాన్ని సంపాదిస్తున్న క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రికెటర్లు అందరితో పోలిస్తే విరాట్ కోహ్లీ నెట్ వర్త్ ఎక్కువ. తాజాగా విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సెర్చింగ్ ఏదైనా ఉంది అంటే అది గూగుల్. గూగుల్ తన వ్యవహార కార్యకలాపాలను 1998 సంవత్సరంలో ప్రారంభించింది. అయితే గూగుల్ ప్రారంభించి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఎక్కువ శాతం మంది వెతికిన పేరు ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీనే. గూగుల్ ప్రారంభమున అయ్యేనాటికి విరాట్ కోహ్లీ ఇంకా క్రికెట్ లోకి ఆరంభం కాలేదు. అయినా కూడా విరాట్ కోహ్లీ ఈ రికార్డు సృష్టించాడు అంటే తనకి అభిమానులు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ విషయాన్ని గూగుల్ ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. ఇది విని కింగ్ కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
End of Article