Ads
కింగ్ కోహ్లీ భారత క్రికెట్ జట్లను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు ముఖ్యంగా విదేశాల్లో టెస్ట్ సీరీస్ లు గెలుస్తూ టీం ఇండియా అభిమానులకి కన్నుల విందుని అందిస్తున్నారు. టీట్వంటీలు, వన్డేలు, టెస్టులు ఇలా అన్ని ఫార్మాట్లలోనూ టీం ఇండియా కి సారధ్య బాధ్యతలు వహిస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇటీవలే అయన తీసుకున్న సంచలన నిర్ణయం అందరిని షాక్ కి గురిచేసింది. వన్డే, టీట్వంటీల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
Video Advertisement
పని భారం ఎక్కువైందని బాటింగ్ పైన తన దృష్టిని సారిస్తానని చెప్పారు. అయితే ఇటీవలే ఒక ఆసక్తి కర విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటారో తెలిసిందే. ఇటీవలే జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అశ్విన్ ని కోపంగా బూతులు తిట్టారని చెబుతున్నారు. ‘ది టెలిగ్రాఫ్’ రాసిన కథనం ప్రకారం.
అశ్విన్ ని తిట్టారని దానికి ప్రతిగా బీసీసీఐ కి వెళ్లి ఫిర్యాదు చేసారని చెప్పారు. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో సీమింగ్ కండిషన్స్ లో ఇద్దరు స్పిన్నర్లు తో బరిలోకి దిగడం టీం ఇండియా పై విమర్శల పాలయ్యారు. ఈ కోపాన్ని అశ్విన్ పై చూపించారని. అప్పటి నుండే వీరిద్దరి మద్యే విబేధాలు వచ్చాయని అంటున్నారు. అందుకే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అశ్విన్ కి చోటు కల్పించలేదని కూడా విమర్శలు వచ్చాయి.
దీని ముందుగానే పసి గట్టిన కోహ్లీ తన పై కోపంగా ఉందని తెలుసుకున్న కోహ్లీ ముందగానే కెప్టెన్సీ ని వదులుకునే ప్రయత్నాలు చేసారని కూడా ఆ పత్రిక పేర్కొంది. అంతే కాదు కోహ్లీకి టీట్వంటీ వరల్డ్ కప్ లో అశ్విన్ ఆడటం ఇష్టం లేదని, కేవలం రోహిత్ కారణంగా మాత్రమే జట్టు లో చోటు దక్కిందని చెబుతున్నారు.
End of Article