Ads
విరాట్ కోహ్లీ ఆటపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. మొన్న మ్యాచ్ అదరకొట్టి కోహ్లీ ప్రశంసలను అందుకున్నాడు. విరాట్ ఆట వలనే పాకిస్థాన్ పై ఇండియా గెలిచింది. అయితే సిడ్నీ గ్రౌండ్ లో మాత్రం ఇండియా చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.
Video Advertisement
భారత జట్టుకి ఇది లక్కీ. 4 మ్యాచ్లను ఆడగా టీమిండియా 3 గెలిచింది. ముఖ్యంగా విరాట్ కి ఇది అదృష్టమని అనచ్చు. ఎందుకంటే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇక్కడ ఆడిన ప్రతీ మ్యాచ్ లో కూడా అదరకొట్టేసాడు.
సిడ్నీ గ్రౌండ్ లో విరాట్ ఆడిన 4 ఇన్నింగ్స్ లో 79 సగటుతో 236 పరుగులు చేశాడు. అయితే వీటిలో త్రి హాఫ్ సెంచరీలు వున్నాయి. 85 రన్స్ SCGలో ఎక్కువ స్కోర్ చేసాడు విరాట్. వీటిని చూస్తేనే అర్ధం అవుతోంది కోహ్లీ ఇక్కడ ఎంత బాగా ఆడుతున్నాడనేది. ఇక రోహిత్ అయితే రెండు మ్యాచ్లు ఆడాడు. ఈ రెండింట్లో 75 పరుగులు చేశాడు. అయితే పాకిస్థాన్ తో పోటీ పడుతున్నప్పుడు రోహిత్ ఫెయిల్ అయ్యాడు.
మరి నెదర్లాండ్స్ తో ఎలా ఆడతాడనేది చూడాలి. ఆ మ్యాచులో విఫలమైన రోహిత్ కి ఈ మ్యాచ్ కీలకంగా ఉండనుంది. మళ్ళీ ఫామ్ లోకి రోహిత్ వచ్చి ఆడాలని రోహిత్ చెబుతున్నాడు. సిడ్నీ గ్రౌండ్ స్పిన్నర్లకు బాగుంటుంది. కృనాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇక్కడ కృనాల్ 4 వికెట్లు పడగొట్టాడు. 36 పరుగులును ఇచ్చాడు. సూపర్ 12 రౌండ్ లో ఇండియా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్లతో ఆడనుంది.
End of Article