విరాట్ కోహ్లీ.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెట్ అంటే చాలామందికి ఎక్కువగా గుర్తుచ్చేది కోహ్లీ పేరే.

Video Advertisement

ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అంత ఇంతా కాదు.

ప్రపంచంలో బెస్ట్ బ్యాటర్లలో టాప్ ఎవరు అంటే కోహ్లీ పేరు బాగా వినిపిస్తుంది. మీ రోల్ మోడల్ ఎవరంటే చాలామంది మొదటగా విరాట్ కోహ్లీ పేరు చెబుతుంటారు. కానీ విరాట్ కోహ్లీకి ఇదే ప్రశ్న అడిగితే.. ఒక్క సెకను ఆలోచించకుండా చెప్పేది సచిన్ టెండూల్కర్ పేరు.

విరాట్ కోహ్లీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో ఎంతోమంది క్రికెటర్స్‌తో కలిసి ఆడాడు. ఎంతో మందికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన కోహ్లీ తన దగ్గర కూడా ఓ స్పెషల్ ఆటోగ్రాఫ్ ఉందని తెలియజేశాడు.

మా ఇంట్లో కేవలం ఆటోగ్రాఫ్ జెర్సీ మాత్రమే ఉందని తెలిపాడు. విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేసినప్పుడు జెర్సీపై సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ జెర్సీ ఇప్పటికీ మాఇంట్లో జాగ్రత్తగా ఉందని కోహ్లీ తెలిపాడు.