బుష్ ఫైర్ బాధితుల సహాయార్థం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న చారిటీ మ్యాచ్‌లో భాగమయ్యేందుకు సచిన్ టెండూల్కర్, యువ రాజ్ సింగ్ సిడ్నీకి వెళ్లారు..జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ లెవెన్‌ టీమ్‌కు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో టీమ్‌కు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌ జట్టుకు పైన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేయనున్నారు.10 ఓవర్ల మ్యాచ్‌లో రెండు జట్లు తలపడునున్నాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంటింగ్‌ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులు చేసింది. పాంటింగ్‌(26), బ్రయాన్‌ లారా(30) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనలో గిల్‌క్రిస్ట్‌ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో గిల్‌క్రిస్ట్‌ టీమ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువరాజ్‌సింగ్‌ 6 బంతులాడి కేవలం రెండే పరుగులు చేయగా..బౌలింగ్‌లో ఒక ఓవర్‌ వేసి వికెట్‌ తీసి 10 పరుగులు ఇచ్చాడు.అయితే మ్యాచ్ మధ్యలో సచిన్ సందడి చేసాడు ..ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు తో కలిపి ఒక్క ఓవర్ ఆడాడు… చాలా రోజుల తర్వాత మాజీ క్రికెటర్లు ఒక దగ్గర చేరడంతో సందడి వాతావరణం నెలకొంది.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles