“ధోని” గురించి సీక్రెట్ బయట పెట్టిన వాట్సన్..!!

“ధోని” గురించి సీక్రెట్ బయట పెట్టిన వాట్సన్..!!

by Sunku Sravan

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవమైన ప్రదర్శనను కనబరిచిందని.. రవీంద్ర జడేజా కెప్టెన్సీ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస పరాజయాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని.. దీంతో మళ్లీ ధోనీ కెప్టెన్సీ అప్పగించారని మనందరికీ తెలుసు. జడేజా కెప్టెన్సీలో మొదటి ఎనిమిది ఆటల్లో చెన్నై రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన ఈ టీం కేవలం మూడు విజయాలు మాత్రమే తన ఖాతాలో వేసుకొని ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నది.

Video Advertisement

కనీసం మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో అయినా గెలిచి ఈ సీజన్ ను గౌరవంగా ముగించాలని సీఎస్కే జట్టు లక్ష్యంగా పెట్టుకున్నది.

ఈ క్రమంలో ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన మాట్లాడుతూ చెన్నై జెర్సీ అయినటువంటి ఎల్లో కనిపించడం ఇదే చివరి సారి అని పేర్కొన్నారు. తర్వాత సీజన్లో ఆడుతాడో లేదో అన్న డైలమా క్రియేట్ చేశారు. మీరంతా నన్ను తప్పకుండా ఎల్లో జెర్సీ లో చూస్తారు అని మరి ఆ ఎల్లో జెర్సీ ఈ ఎల్లో జెర్సీ నా అనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే అని ధోని కామెంట్ తో అన్నారు. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ స్టార్ వాట్సన్ స్పందించారు.

2018 నుండి 2020 మధ్యకాలంలో చెన్నై జట్టుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ధోనీతో కలిసి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి వాట్సాప్ ధోనీ ప్రకటన వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని వెల్లడించారు. ధోని వెరైటీగా ఎల్లో జెర్సీలో కనిపిస్తాను అన్నాడంటే కోచ్ జెర్సీ లో కనిపిస్తాడు కావచ్చని ఇంట్ ఇచ్చారేమో.. ధోనీ ముగింపు చెప్పాగా సీఎస్కే జట్టుతో సంబంధం లేకుండా ఉంటాడు అని నేను చెప్పలేను. సిఎస్ కె ను అసలు వదలడు. ఆయన ఆడటం ఆపినా కోచ్ గాను క్రికెట్ కు డైరెక్టర్ గానో సీఎస్కే జట్టు తరఫున బాధ్యత నిర్వహిస్తారని నాకు తెలుసని అన్నాడు వాట్సన్.


End of Article

You may also like