స్టార్ మా లో కొంతకాలం నుండి ప్రసారం అవుతూ ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ సంపాదించిన సీరియల్ జానకి కలగనలేదు. ఒక సాధారణ యువతి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటూ ఉండడం చుట్టూ ఈ సీరియల్ తిరుగుతుంది.

Video Advertisement

ఈ సీరియల్ లో ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సీరియల్ కథ కూడా రొటీన్ కథలకి భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులన్నీ ఈ సీరియల్ చాలా తొందరగా ఆకర్షించగలిగింది. అయితే ఈ సీరియల్ లో పనిమనిషి పాత్ర గత కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు.

janaki kalakanaledu 2

ఇప్పుడు ఆమె స్థానంలోకి మాలోకం అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతని పాత్ర బాగానే ఉన్నా కూడా పనిమనిషి చికిత పాత్ర సడన్ గా సీరియల్ లో నుండి వెళ్లిపోవడం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ పాత్ర పోషించిన నటి పేరు రమ్య. ఆమె ఖమ్మం జిల్లాలోని మునుగూరుకి చెందినవారు. రమ్య డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టారు.

what happened to chikitha role in janaki kalaganaledu serial

ఆట సందీప్ దగ్గర డాన్సర్ గా చేశారు. ఆ తర్వాత హరి మాస్టర్ డాన్స్ గ్రూప్ లో చేశారు. అప్పుడు ఎన్నో ఈవెంట్స్ లో రమ్య డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎన్నో కవర్ సాంగ్స్ కూడా చేశారు.

what happened to chikitha role in janaki kalaganaledu serial

ముందు వేరే సీరియల్ కి రమ్యని సెలెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో రమ్య నటించారు. ఇప్పుడు ముత్యమంత ముద్దు సీరియల్ లో కూడా నటించారు. జానకి కలగనలేదు సీరియల్ తో ఎంతో పేరు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా రమ్య చాలా యాక్టివ్ గా ఉంటారు.

what happened to chikitha role in janaki kalaganaledu serial

సీరియల్ లో పోషించే సాంప్రదాయ పాత్రకి భిన్నంగా రమ్య చాలా మోడరన్ గా ఉంటారు అని తన సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. అయితే జానకి కలగనలేదు సీరియల్ లో రమ్య రాకపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ చాలా మంది ప్రేక్షకులు మాత్రం మళ్లీ రమ్య షో లోకి వస్తే బాగుండు అని అంటున్నారు.