Ads
మన ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో కచ్చితంగా ఉండాల్సిన వాటిలో వాష్ రూమ్స్ ఒకటి. అందుకే ప్రభుత్వం వారు కూడా రోడ్డుపై దారి మధ్యలో వాష్ రూమ్స్ ఉండేలాగా ఏర్పాటు చేశారు.
Video Advertisement
అయితే ఏదైనా అత్యవసరమైన వర్క్ లో ఉన్నప్పుడు వాష్ రూమ్ ఎమర్జెన్సీ రావడం అనేది సహజం. అలాగే క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి.
మనకి తెలిసినంత ప్రకారం క్రికెట్ కానీ, ఇతర ఏదైనా క్రీడలో కానీ, రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒకసారి ఆట కోసం మైదానంలోకి అడుగు పెట్టాక, వాళ్లు అవుట్ అయితే, లేదా మధ్యలో దెబ్బతగలడం వంటివి జరిగితే తప్ప మైదానం విడిచి వెళ్ళడానికి ఉండదు. కానీ వాష్ రూమ్ ఎమర్జెన్సీకి మాత్రం ఈ రూల్ మినహాయింపే. అంటే సాధారణంగా ఇలాంటి సందర్భాలు ఎదురవ్వవు.
ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు ఆ క్రికెటర్ శరీరంలో ఉన్న నీరు అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అంతే కాకుండా మధ్యలో డ్రింక్స్ బ్రేక్ లాంటివి ఉన్నప్పుడు ప్లేయర్ కి వాష్ రూమ్ కి వెళ్లే అనుమతిస్తారు. అలాగే ఒక ప్లేయర్ తన ఇన్నింగ్స్ మొదలయ్యే ముందే వాష్ రూమ్ కి వెళ్లి వస్తాడు. కానీ ఒకవేళ ఆట మధ్యలో వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ ప్లేయర్ వెళ్ళచ్చు.
ఇలా ఒకసారి ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని వాష్ రూమ్ కి వెళ్ళగా, ఆయన స్థానంలో కోహ్లీ బాధ్యతలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 44 వ ఓవర్ లో ధోనీ వాష్ రూమ్ కి వెళ్లి 45 ఓవర్ ముగియగానే వచ్చారు.
తర్వాత ఒక ఇంటర్వ్యూలో “ధోనీ మ్యాచ్ మధ్యలో బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?” అని టీమిండియా మేనేజర్ బిశ్వరూప్ దేయ్ ని అడిగినప్పుడు, “ధోనీ వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది” అని సమాధానం చెప్పారు. అలా ఆటల్లో కూడా వాష్ రూమ్ ఎమర్జెన్సీ ఉంటే రూల్స్ సడలింపు ఉంటుంది.
End of Article