Ads
ఐపీఎల్ 2020 లో ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి, ముంబై ఇండియన్స్ జట్టు కి జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరిగింది. అందులో కూడా రెండు జట్టుల స్కోర్ టై అవ్వడంతో మరోసారి సూపర్ నిర్వహించారు. ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. కానీ మనలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే.
Video Advertisement
“ఒకవేళ మొదటి సూపర్ ఓవర్ లో స్కోర్ టై అయితే రెండవ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. కానీ ఒకవేళ రెండవ సూపర్ ఓవర్ లో కూడా స్కోర్ టై అయితే, అప్పుడు పరిస్థితి ఏంటి?” ఈ అనుమానం మనలో కొంతమందికైనా వచ్చి ఉండొచ్చు. దీనికి జవాబు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు మ్యాచ్ లో స్కోర్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇందులో రెండు జట్లు, వారి జట్టు నుండి బ్యాటింగ్ చేసే ముగ్గురి పేర్లను, ఒక బౌలర్ పేరుని ముందే చెప్పాలి. వీళ్లు మొదటి సూపర్ ఓవర్ లో ఆడతారు. ఒకవేళ రెండవ సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే మొదటి సూపర్ ఓవర్ లో ఆడిన వాళ్ళు ఇందులో ఆడకూడదు.
ఒకవేళ రెండవ సూపర్ ఓవర్ కూడా టై అయితే మూడవ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇందులో మొదటి సూపర్ ఓవర్ లో ఆడిన బౌలర్, బ్యాట్స్ మెన్ మూడవ సూపర్ ఓవర్ ఆడడానికి అర్హులవుతారు. ఒక వేళ వాతావరణం కారణంగానో, లేదా ఇంకేదైనా కారణంగానో సూపర్ ఓవర్ ఆడకుండా వదిలేస్తే, గేమ్ ని టై గా డిక్లేర్ చేస్తారు. పాయింట్స్ ని రెండు జట్లు స్ప్లిట్ చేసుకుంటారు.
మ్యాచ్ రిఫరీ కూడా ఆ పర్టిక్యులర్ గేమ్ లో ఎన్ని సూపర్ ఓవర్స్ నిర్వహించాలి అనే దానిపై లిమిట్ నిర్ణయించుకుంటారు. ఒక వేళ ఆ లిమిట్ వరకు గనుక వస్తే, అప్పటి వరకు కూడా ఎవరు గెలిచారో నిర్ణయించకపోతే, మ్యాచ్ ని డ్రా గా డిక్లేర్ చేస్తారు.
End of Article