సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది..? అసలు ఏం ఉంది ఇందులో..?

సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది..? అసలు ఏం ఉంది ఇందులో..?

by kavitha

Ads

ఇటీవల వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. సినిమాల రేంజ్ లో రూపొందిస్తుండడంతో వెబ్ సిరీస్ లు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ లను చూడడానికి  ఆడియెన్స్ కూడా ఆసక్తిని కనపరుస్తున్నారు.

Video Advertisement

వెబ్ సిరీస్ లను భారీ బడ్జెట్ తో నిర్మించడం అమెజాన్ ప్రైమ్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. బ్రీత్, ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ లను మూవీ స్థాయిలో ఖర్చు పెట్టడం వల్లే ప్రేక్షకులని ఆకట్టుకోగలిగాయి. తాజాగా రిలీజ్ అయిన ‘దహాద్’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
దహాద్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో నటించింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా వైరల్ అవుతున్న విజయ్ వర్మ ఈ సిరీస్ లో విలన్ పాత్రలో నటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ దహాద్ లో కథ ఏమిటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే మండువా అనే చిన్న సిటీలో ఊహించని విధంగా యువతులు పబ్లిక్ టాయిలెట్స్ లో బలవన్మరణానికి పాల్పడి మరణిస్తుంటారు. ఇదే విధంగా 27 కేసులు రిజిస్టర్ అవుతాయి.ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంజలి భాటి (సోనాక్షి సిన్హా)కి అదే సిటీలో ఒక  కాలేజీలో లెక్చరర్  పనిచేస్తున్న వ్యక్తి (విజయ్ వర్మ) పై అనుమానం కలుగుతుంది. కానీ ఆమెకు ఎటువంటి ఆధారాలు లభించవు. ఇక ఈ కేసుల ఒక్కో చిక్కుముడిని సాల్వ్ చేస్తూ వెళ్లే క్రమంలో పోలీస్ ఆఫీసర్ అంజలి మరియు ఆమె కొలీగ్స్ కి విస్మయం కలిగించే అనేక విషయాలు తెలుస్తాయి. ఆ విషయలు ఏమిటి? చివరికి అంజలి హంతకుడిని ఎలా పట్టుకుంది అనేది కథ. ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్లతో రూపొందించారు. అయితే ట్రైలర్ లోనే విలన్ ఎవరనేది చూపించారు. విలన్  తప్పించుకునే క్రమంలో హత్యలను ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

Also Read: “స్టైల్ అదిరింది..!” అంటూ… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” పోస్టర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like