మంత్రం తప్పు చదివితే దేవుడు దండిస్తాడా..? చెడు జరుగుతుందన్న నమ్మకానికి అసలు కారణం ఏంటి..?

మంత్రం తప్పు చదివితే దేవుడు దండిస్తాడా..? చెడు జరుగుతుందన్న నమ్మకానికి అసలు కారణం ఏంటి..?

by Anudeep

Ads

మనం ఏ పూజ చేసుకున్నా మంత్రోచ్ఛారణ తప్పని సరి. ఎందుకంటే.. మంత్రం చదవడం వలన వచ్చే శబ్దం వాతావరణాన్ని శుభ్ర పర్చడం తో పాటు ప్రశాంతత కలిగేవిధం గా చేస్తుంది. అందుకే.. దేవాలయాల్లో అడుగు పెట్టగానే అంతటి ప్రశాంత భావన కలుగుతుంది. మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టే.. మంత్రాలు చదవాలంటే.. శుచి చేయబడ్డ ప్రదేశం లో శుభ్రం గా చదవాలన్న నియమం ఉంది.

Video Advertisement

mantram 1

అందుకే పూజ చేసుకునే ముందు.. శుభ్రం గా ఉండాలి. ఐతే.. మంత్రోచ్ఛారణ చేసే సమయం లో దోషం ఉండకూడదంటుంటారు. చాలా మందికి అలవాటు లేని కారణం గా మంత్రం నోరు తిరగక పోవచ్చు. అయితే.. ఇలా మంత్రం తప్పు చదవడం వలన దేవుడు దండిస్తాడా? మంత్రాలు తప్పు గా చదివితే చెడు జరుగుతుంది అని ఎందుకు చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

mantram 3

నిజానికి మంత్రం తప్పు చదవడం వలన దేవుడేమి దండించడు. మనం మంత్రాలు చదవడానికి పడుతున్న పాట్లు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కానీ.. మంత్రోచ్ఛారణ వెనక అసలు అర్ధాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శక్తీ స్వరూపిణి అయినా అమ్మవారి నుంచే త్రిమూర్తులు ఉద్భవించారు. ఆ శక్తి ప్రకృతి రూపం లోనే ఉంటుంది. తగిన శబ్దాలను ఉచ్చరించడం వలన ఈ ప్రకృతి లో మార్పులు జరిగి ప్రశాంతత నెలకొంటుంది.

mantram 4

అలా పలికే శబ్దాలనే మంత్రాలు గా పేర్కొంటున్నాం. వీటిని మనం ఉచ్చరించాల్సిన పధ్ధతి లో కాకుండా.. తప్పు గా చదవడం వలన ప్రకృతి లో జరిగే మార్పులు కూడా వేరు గా ఉంటాయి. దీని వల్లనే కొన్ని సార్లు చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఈ చెడు జరగడానికి మనం చేసే మంత్రోచ్ఛారణ లో తప్పులే కారణం తప్ప.. దేవుడు కారణం కాదు. ఆయన ఎప్పుడు భక్తులను చల్లగానే చూస్తాడు. మనం మంత్రాలను తప్పు చదివి.. ఎదురైనా ఇబ్బందులకు దేవుడే కారణం అని నిందించకూడదు. వాస్తవాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి.


End of Article

You may also like