Home serials “కార్తీక దీపం” సీరియల్ దర్శకుడు ఎవరో తెలుసా.? అంతకముందు ఏ సీరియల్స్ తీశారు అంటే.?

“కార్తీక దీపం” సీరియల్ దర్శకుడు ఎవరో తెలుసా.? అంతకముందు ఏ సీరియల్స్ తీశారు అంటే.?

by Mohana Priya

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.

Karthika deepam serial director

అందులో పాత్రలు మనకి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది. అంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంత క్లోజ్ అయిపోయారు అని అర్థం. అందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు. వాళ్ళు ఎక్కడైనా వేరే షోస్ లో కనిపించినా కూడా, వాళ్ళని చూస్తే వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి ఇవే పేర్లు గుర్తుకొస్తున్నాయి. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యారు.

Karthika deepam serial director

అయితే మనందరికీ తెరమీద ఈ నటీనటులందరూ కనిపిస్తారులే కానీ తెరవెనుక ఉండి కథను నడిపించే దర్శకుడు ఎవరో ఎవరికీ తెలియదు. అందులోనూ కార్తీక దీపం లాంటి హిట్ సీరియల్ దర్శకుడు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ పేరు కాపుగంటి రాజేంద్ర.

Karthika deepam serial director

రాజేంద్ర అంతకుముందు బంగారు బొమ్మ లాంటి సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. అలాగే కొన్ని సినిమాలకి కూడా పని చేశారు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నారు రాజేంద్ర. ఈ సీరియల్ ఎంత ప్రేక్షకాదరణ పొందుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ హీరోయిన్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రాజేంద్రతో దిగిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

You may also like