16వ సీజన్ లో ఐపీఎల్ చాలా రసవత్తరంగా కోనసాగుతోంది. ఇప్పటి వరకు 47 మ్యాచ్‌లు జరిగాయి. ప్లే-ఆఫ్స్ పోరులో ఏకంగా ఏడు జట్ల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది.

Video Advertisement

ఇక ఈ సీజన్ లో కొందరు కుర్రాళ్లు తమ ఆటతో అదరగొడుతున్నారు. నిజానికి ఐపీఎల్ అనేది టాలెంటెడ్ ప్లేయర్స్ వేదిక. ఇండియన్ యువ క్రికెటర్ల ఆటతో ఈ లీగ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ యువ ఆటగాళ్లు లీగ్ ఫామ్ తో భారత జట్టుకు సెలెక్ట్ అయినా ఆశ్చర్యం లేదు. మరి అలాంటి ఒక యువ క్రికెటర్ గురించి ఇప్పుడు చూద్దాం..
ఈ లీగ్ ద్వారా భారత జట్టుతో పాటు, ఆయా దేశాల జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ తమ ప్రతిభను ప్రదర్శిస్తే చాలు, వారిని నేషనల్ టీం లోకి తీసుకుంటున్నారు. వెంకటేష్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఐపీఎల్ ద్వారానే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్ లో తన ఆటతో ఆకట్టుకుంటున్న ఆ యువ క్రికెటర్ పంజాబ్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ. జితేష్ వయసు 29 సంవత్సరాలు. అతని అతను ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారుపంజాబ్ జట్టు తరపున ఆడుతున్న జితేష్, కీపర్ గానే కాకుండా, విధ్వంసకర బ్యాటింగ్ తో గుర్తింపు సంపాదించు కున్నాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జితేష్‌కు ఇండియా టీ20 జట్టులో స్థానం కల్పించాలని రోజు రోజుకు డిమాండ్ కూడా పెరుగుతుంది. బుధవారం నాడు ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జితేష్ 27 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 49 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో జితేష్ స్థాయి మరింత పెరిగిందని చెప్పవచ్చు.
జితేష్‌కి ఐపీఎల్‌లో ఇదే టాప్ స్కోరు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ పై జితేష్‌ 44 పరుగులు చేశాడు. అయితే జితేష్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు. అందువల్ల ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం అతనికి లేదు. అయినప్పటికీ అతనికి వచ్చిన ఛాన్స్ నే జితేష్‌ సద్వినియోగం చేసుకున్నాడు. చివరి ఓవర్లలో జితేష్‌ బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉంటుంది. ఈ యంగ్ ప్లేయర్ ని సరైన విధానంలో వాడినట్లయితే మరో ధోని కాగలడని క్రికెటర్లు నిపుణులు భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ధోని అనంతరం భారత జట్టుకు ధోని స్థాయిలో వికెట్ కీపర్ బ్యాటర్ లభించలేదు. అయితే  ఆ లక్షణాలు  జితేష్ శర్మలో కనిపిస్తున్నాయి. దీంతో సరిగ్గా వాడితే మరో ధోనీ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.