IPL 2024 Auction: ఆ ఇద్దరు ప్లేయర్లపై కన్నేసిన “CSK”…రాయుడు, స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకే.!

IPL 2024 Auction: ఆ ఇద్దరు ప్లేయర్లపై కన్నేసిన “CSK”…రాయుడు, స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకే.!

by Harika

Ads

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) – 2024 మరికొద్ది రోజుల్లో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వేలం ప్రక్రియలో ముందుగానే ఏ ఆటగాడిని తీసుకోవాలి? ఎవరికి ఎంతవరకు ఖర్చు పెట్టాలి? అని 10 ఫ్రాంచైజీలూ తర్జనభర్జన మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్..బెన్ స్టోక్స్‌..అంబ‌టి రాయుడు స్థానాలలో ఎవరిని భర్తీ చేయబోతోంది అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

Video Advertisement

csk captain

రీసెంట్ గా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ అశోక్ చోప్రా స్పందించడంతోపాటు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. స్ట్రోక్స్ స్థానంలో ఒక మంచి ఆల్రౌండర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోందట. ఈ క్రమంలో కివి స్టార్ ఆల్ రౌండర్ ప్లేయర్స్ ర‌చిన్ ర‌వీంద్ర‌, డారెల్ మిచెల్ లను పరిగణలోకి తీసుకునే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.బెన్ స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయడానికి ర‌చిన్ రవిచంద్ర కరెక్టు ఛాయిస్ అని భావిస్తున్న టాక్.. ఒకవేళ ర‌చిన్ దొరకని పక్షంలో నెక్స్ట్ చాయిస్ డారెల్ మిచెల్.

చెన్నైకి ప్రస్తుతానికి స్పిన్నర్స్ తో పనిలేదు.. ఎందుకంటే జట్టులో ఇప్పటికే రవిచంద్ర జడేజా,మోయిన్ అలీ, మ‌హీశ్ తీక్ష‌ణ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఇక రాయుడు ప్లేస్ లోకి మ‌నీష్ పాండే బెట‌ర్ ఆప్ష‌న్. జట్టులో ఇప్పటికే ధోని ఉన్న అతను లాస్ట్ లో వస్తాడు కాబట్టి ఈలోపు ఇన్నింగ్స్ ను తమ వైపు తిప్పే ఆటగాడు కావాలి. ఆ యాంగిల్ లో చూస్తే రాయుడు ప్లేస్ లోకి మ‌నీష్ పాండే ..క‌రుణ్ నాయ‌ర్ చెన్నై టీం కి ఉన్న మంచి ఆప్షన్స్. ఈ నేపథ్యంలో చెన్నై టీం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.


End of Article

You may also like