Ads
బ్యాట్సమెన్ ఎప్పుడు హాఫ్-సెంచరీ,సెంచరీ చేసేయాలి అని అనుకుంటారు. బౌలర్లు వికెట్స్ పడకొట్టి చరిత్రలో నిలవాలి అని అనుకుంటారు.
Video Advertisement
మరి బ్యాట్సమెన్ హాఫ్-సెంచరీ కానీ సెంచరీ కానీ చేసినప్పుడు కానీ బాట్ పైకి ఎత్తుతారు;బౌలర్లు ఏమో బాల్ ను పైకి ఎత్తుతారు దానికి కారణాలు ఉన్నాయ్.అవి ఏమిటో ఇపుడు చూదాం.
క్రికెట్ అనేది టీమ్ గేమ్. జట్టుగా రాణిస్తేనే విజయాలు సాధ్యం అవుతాయి. వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమే. కాకపోతే నిలకడగా విజయాలు సాధించాలంటే జట్టుగా రాణించాల్సిందే.అయితే విజయాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు సైతం అభిమానులకు మంచి జోష్ ని ఇస్తాయి. ఆయా ప్లేయర్ల మీద అభిమానం పెరిగేలా చేస్తాయ్. అందుకే ప్రతి బ్యాటరూ పరుగుల పండుగ చేసుకోవాలనుకుంటాడు. బరిలో దిగినప్పుడల్లా మైల్‌స్టోన్స్ సెట్ చేయాలనుకుంటాడు క్రికెటర్లు సాధించే ఒక్కో మైల్‌స్టోన్..వారి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. నిజానికి కెరీర్‌లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మైల్‌స్టోన్సే మధురానుభూతులుగా కనిపిస్తాయ్. ఏం సాధించామన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయ్. అందుకే బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా..సెల్రబేట్ చేసుకుంటారు.
50 పరుగులు కొట్టడం ఒక ఎత్తయితే..వంద పరుగులు చేయడం మరో ఎత్తు. ఫార్మాట్ ఏదైనా సెంచరీ అనేది బ్యాటర్స్‌కు టానిక్‌లా పని చేస్తుంది. రికార్డుల మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. సెంచరీ చేసిన ప్రతిసారీ తానేంటో విమర్శకులకు సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుంది. జట్టు కోసం వంద పరుగులు చేశానన్న సంతృప్తి బ్యాటర్‌కు కలుగుతుంది.జట్టు కోసం 50 సాధించానన్న సంతృప్తి కోసమూ బ్యాట్‌తో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తారు. బ్యాటర్స్‌కు 50 పరుగులు అనేది ఓ బెంచ్ మార్క్. అందుకే ఆ మార్క్‌ను అందుకోగానే బ్యాట్‌ను పైకి ఎత్తడం సంప్రదాయంగా మారింది. డెడికేషన్‌తో శతకం సాధించామన్న మెస్సేజ్‌నూ ఇస్తారు.
వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో తమదైన సంతకం చేయాలనుకుంటారు.ఇక బాల్‌తో మ్యాజిక్ చేసినప్పుడు బౌలర్లు కూడా సంబరాలు చేసుకుంటారు. గ్రౌండ్‌ను విడిచి వెళ్లేటప్పుడు చేతితో బాల్‌ను పైకెత్తి చూపిస్తారు.అయితే హాఫ్ సెంచరీ, సెంచరీ, ఫైవ్ వికెట్స్ హాల్ సాధించినప్పుడు ప్లేయర్లు ఇలాగే సెలెబ్రేట్ చేసుకోవాలని ఏమీ నిబంధన లేదు.కాకపోతే దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
End of Article