ఐపీఎల్ 2021 వేలంపాటలో “చెన్నై సూపర్ కింగ్స్” జట్టు “పుజారా”ను కొనడానికి కారణం ఇదేనా.?

ఐపీఎల్ 2021 వేలంపాటలో “చెన్నై సూపర్ కింగ్స్” జట్టు “పుజారా”ను కొనడానికి కారణం ఇదేనా.?

by Mohana Priya

మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది.

Video Advertisement

కానీ ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తలతో ఆడియన్స్ ని స్టేడియంలోకి రావడానికి అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరానికి ఐపిఎల్ ఆక్షన్ ఇటీవల జరిగింది. ఇందులో చటేశ్వర్ పుజారాని  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 50 లక్షలకు కొనుగోలు చేశారు. పుజారా టెస్ట్ ప్లేయర్ కదా చెన్నై జట్టు ఎందుకు కొనుగోలు చేసారు అనే డౌట్ చాలామందికి వచ్చింది. కొంతమంది అయితే 30 + ఏజ్ కదా అంటూ కూడా ట్రోల్ చేసారు. కానీ ఈ కారణాలు ఒకసారి చూడండి.

ఇది క్లియర్ గా అర్ధం అవ్వాలి అంటే…ఒకసారి 2011 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టి 20 మ్యాచ్ రిసల్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ ధోని మాట్లాడుతూ …”పార్టనర్ షిప్ అనేది చాలా ముఖ్యము. వరసగా వికెట్లు పడుతున్నప్పుడు. రన్స్ తక్కువ స్కోర్ చేసినా పర్లేదు. వికెట్స్ ఆపడం ముఖ్యం. 11 ఓవర్లకె అందరు అవుట్ అయిపోతే ఇక మిగిలిన ఓవర్లు ఉండి కూడా లాభం లేదు. డెత్ ఓవర్లలో కనీసం 5 – 6 వికెట్లు ఉంటే స్కోర్ చేయడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి టీ 20 లో కూడా పార్టనర్ షిప్ నిలబెట్టడానికి. వికెట్లు పడకుండా ఆపడానికి ఒక వన్ డే ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ ఉండాలి. వరసగా వికెట్లు పడితే ప్రెషర్ లోకి వెళ్ళిపోతాము.” అని అన్నారు. బహుశా అదే లాజిక్ ఇప్పుడు చెన్నై జట్టు కోసం ఉపయోగించారు అనుకుంటా.

ధోనితో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటానికి భారత జట్టులో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఉంటారు. చాలా సంవత్సరాల వరకు ధోని యాంకర్ ప్లేయర్ గా ఉన్నారు.

కానీ ధోని 5 డౌన్ వచ్చేసరికి …అప్పటికే చాలా వికెట్లు నష్టపోతున్నారు. కాబట్టి టాప్ 3 లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కోసం చెన్నై జట్టు వెతుకుతుంది. మురళి విజయ్ టీం లో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. టాప్ ఆర్డర్ లో ప్రెషర్ అంతా రాయుడు పైనే పడుతుంది. పైగా ఈ సారి వాట్సన్ కూడా రిటైర్ అవ్వడంతో చెన్నై జట్టు స్టాండ్ ఇచ్చే ప్లేయర్ కోసం చూస్తున్నారు. ఇంతకముందు జట్టులో రైనా ఉండడంతో చాలా బలంగా కనిపించింది. కానీ గత సీజన్ లో రైనా దూరమయ్యాడు. టీం పటిష్టతను కోల్పోయింది. రితురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ ప్లేయర్స్ తో పార్టనర్ షిప్ బిల్డ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే పుజారాకు అవకాశం ఇచ్చారు అనిపిస్తుంది.

Also Read  : ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుదల అవ్వడంతో ట్రెండ్ అవుతున్న 12 మీమ్స్.!


You may also like

Leave a Comment