Ads
ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో XI మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో కనిపించలేదు. ప్రస్తుతం చెన్నైకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. కానీ ఇందులో జడేజా కనిపించకపోవడం వెనుక అనేక అనుమానాలు లేవనెత్తాయి. అయితే సీఎస్ కె నాలుగు మ్యాచ్ ల్లో గెలవాల్సి ఉండగా జడేజాకు తప్పించడానికి కారణం ఏంటో మహేంద్ర సింగ్ తెలియజేశారు.
Video Advertisement
రవీంద్ర జడేజా ఫిట్ గా లేడని, అందుకే ఆడటం లేదని అన్నారు. ఫిట్ గా లేడని చెప్పాడు తప్ప అతడు సమస్య ఏమిటనేది తెలియజేయలేదు. తప్పనిసరిగా గెలవాల్సిన కీలక మ్యాచ్ లో రవీంద్ర జడేజా కనిపించకపోవడంతో చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటుగా సిఎస్ కే కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ నుంచి రవీంద్ర జడేజాను అన్ ఫాలో చేసింది. దీంతో చాలామంది అభిమానుల్లో అనుమానం రేకెత్తిస్తోంది.
గాయం అయి ఫిట్ గా లేకపోతే ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ నుంచి ఎందుకు తీసేస్తానని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడుగుతున్నారు. రవీంద్ర జడేజా కెప్టెన్సీ లో ఉన్నప్పుడు చెన్నై తొలి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. తర్వాత బెంగళూరుపై ఖాతా తెరిచిన నిరంతర విజయాలు సాధించలేకపోయింది. మే 30 వ తేదీన రవీంద్ర జడేజాను కెప్టెన్సీ నుంచి తొలగించి మహేంద్రసింగ్ ధోనికి అప్పగించారు. అప్పటి నుంచి బౌలింగ్,బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రవీంద్ర జడేజా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఆయనను పూర్తిగా తొలగించారు.
End of Article