కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

by Mohana Priya

Ads

భారత క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మహేంద్రసింగ్ ధోని కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడున్న ఎంతో మంది క్రికెటర్లకు, అలాగే ఎంతోమంది అప్ కమింగ్ క్రికెటర్లకు స్పూర్తినిచ్చిన ప్లేయర్స్ లో మహేంద్ర సింగ్ ధోనీ కచ్చితంగా ఉంటారు.

Video Advertisement

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఎంత మంది బాధ పడ్డారో అందరికీ తెలుసు. అంతలా ధోని ని అభిమానించారు ప్రజలు. అభిమానిస్తూనే ఉంటారు కూడా.

మహేంద్ర సింగ్ ధోనీ కెరియర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత కష్టపడి పైకి వచ్చారు అనే విషయం అందరం చూస్తూనే ఉన్నాం. ధోని సక్సెస్ స్టోరీ గురించి వివరించాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు. కొంతమందికి అయితే ధోని గురించి చిన్న చిన్న వివరాలు కూడా తెలిసే ఉంటాయి. అంతలా అబ్జర్వ్ చేస్తాం మరి. మనలో అందరికి కాకపోయినా కూడా కొందరికైనా ఈ అనుమానం వచ్చే ఉంటుంది. అది ఏంటంటే.

ధోని హెల్మెట్ మీద భారతదేశం జాతీయ జెండా సింబల్ ఉండదు. కానీ మిగిలిన భారతదేశం జట్టు క్రికెటర్స్ హెల్మెట్ మీద మాత్రం జాతీయ జెండా సింబల్ ఉంటుంది.

మీలో కొంతమందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కొంతమందికి ఈ విషయం తెలియక పోవచ్చు. ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే.

సాధారణంగా వికెట్ కీపర్ హెల్మెట్ ధరించనప్పుడు కొంచెం దూరం లో పెట్టాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం మన జాతీయ జెండా గౌరవానికి చిహ్నం. అందుకే జెండా అలా నేలమీద ఉండకూడదు. కాబట్టి ఒకవేళ హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉంటే హెల్మెట్ పక్కన పెట్టకూడదు. ఒకవేళ హెల్మెట్ పక్కన పెట్టాలి అంటే హెల్మెట్ మీద జాతీయ జెండా సింబల్ ఉండకూడదు. అంతేకాకుండా వికెట్ కీపింగ్ చేసేటప్పుడు బాల్ హెల్మెట్ కి తగిలే అవకాశాలు ఉంటాయి. అలా బాల్ జాతీయ జెండా కి తగలకూడదు.

మహేంద్ర సింగ్ ధోనీకి దేశం పై ఎంతో గౌరవం ఉంది అనే విషయం అందరికీ తెలుసు. దేశం పై ఉన్న ప్రేమ తో మహేంద్రసింగ్ ధోని ఇండియన్ ఆర్మీ లో లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్ స్వీకరించారు. ఒకవేళ తాను క్రికెటర్ కాకపోయి ఉంటే ఆర్మీలో జాయిన్ అయ్యేవాడిని అని ధోని ఎన్నోసార్లు చెప్పారు.

ALSO READ : డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోనీ గ్లవ్స్ అడిగేది అందుకా..? అందులో ఈ కోడ్ మెసేజ్ దాగుందా.?


End of Article

You may also like