సెమీస్ బర్త్ కంఫర్మ్ అవ్వాలంటే వరల్డ్ కప్ లో భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్ లు నెగ్గాలి.?

సెమీస్ బర్త్ కంఫర్మ్ అవ్వాలంటే వరల్డ్ కప్ లో భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్ లు నెగ్గాలి.?

by Mounika Singaluri

Ads

2023 ప్రపంచ కప్పులో టీమిండియా తమ జోరు కొనసాగిస్తుంది. టీం సమిష్ఠ ప్రదర్శనతో విజయాల పరంపరన నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల లోనూ విజయాలు సాధించి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలబడింది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.20 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ను ఓడించి చరిత్రను తిరగరాసింది. 20 ఏళ్ల నుండి న్యూజిలాండ్ చేతిలో ప్రపంచ కప్ సిరీస్ లో భారత్ ఓడిపోతూనే ఉంది. న్యూజిలాండ్ ను ఓడించాలి అనేది భారత్ టీం తో పాటు యావత్తు భారత అభిమానులకు చిరకాల కల. అది ఆదివారం నెరవేరింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ టీం ఒక దశలో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్లకు వికెట్లు తీయడం కష్టంగా మారింది. కానీ భారత్ బౌలర్లు తమ బౌలింగ్ తీరును మార్చుకుని వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు. స్టార్ బౌలర్ షమి అయితే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించగా, జడేజా కోహ్లీకి సహకారం అందించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.దాంతో ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరగనీ జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ టీమిండియా తో ఓటమి తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.భారత జట్టు అధికారికంగా టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న కూడా ఇంకా సెమిస్ కి ప్రవేశించలేదు. సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. టీమిండియా కు ఇంకా నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచిన సరిపోతుంది.భారత్ కు సెమీస్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు భారత్, న్యూజిలాండ్ సెమీస్ కి అర్హత సాధించడం ఖాయమే. వీరితోపాటు మిగతా రెండు జట్లు ఏవి సెమీఫైనల్ కి చేరతాయి అనేది వేచి చూడాలి. Also Read:కొంప ముంచావు కాదయ్యా కేన్ మామా ! ఏమో అనుకున్నాం ఇలా చేసావు ఏంటి !

Video Advertisement


End of Article

You may also like