Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15 ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ బౌలర్లు అక్సర్ పటేల్, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ జట్టు 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఢిల్లీ ఓపెనర్లు పృద్వి షా, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పృథ్వీ షా(41) ఔటైనా,వార్నర్ (60 నాటౌట్ ), సర్పరాజ్ (13 నాటౌట్) మిగతా పని కానిచ్చారు.
Video Advertisement
దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడుతూ ఆడింది. శిఖర్ ధావన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ ఔట్ చేయడంతో పంజాబ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్( 22) మరోసారి నిరాశపరిచాడు.
విదేశీ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో (9), లియామ్ లివింగ్ స్టన్ (2)కూడా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కాసేపు జట్టును ఆదుకున్న జితేష్ శర్మ (32)ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ విజృంభించి.. ఒకే ఓవర్లో రబడా(2), నాథన్ ఎలిస్(0)ను పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లోని ఏకైక సిక్సర్ బాదిన రాహుల్ చాహర్ (12)ను కూడా లలిత్ యాదవ్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అర్ష దీప్ సింగ్ (9)రనౌట్ అవ్వడంతో పంజాబ్ ఆలౌట్ అయింది. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ మ్యాచ్ లో ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 10 పరుగులు మాత్రమే ఇచ్చిన అక్సర్ పటేల్‌కి కాకుండా 34 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోనీ కుల్దీప్ యాదవ్ తీసింది ముఖ్యమైన వికెట్లు కూడా కాదు. పోనీ అత్యవసర సమయంలో కూడా వికెట్లు తీయలేదు. కానీ అక్సర్ పటేల్ మాత్రమే మంచి ఫార్మ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ వికెట్ తీశారు. మరి అక్సర్ పటేల్‌ని కాదని కుల్దీప్ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం వెనుక కారణం ఏంటో.
End of Article