Ads
దినేష్ కార్తీక్.. ప్రస్తుత ఐపీల్ లో అత్యద్భుత ఫామ్ లో కొనసాగుతున్న ఆర్సీబీ ఆటగాడు. ఆర్సీబీ కార్తీక్ ని 5.50Cr కి కొనుగోలు చేసింది. గత ఐపీల్ లో Kolkata Knight Riders తరఫున ఆడిన దినేష్ పేలవమైన ఆటతీరు కనబరిచాడు. అయితే అందుకు భిన్నంగా ఈ సీజన్ లో 57.40 యావరేజ్, 191.33 స్ట్రైక్ రేట్ తో దినేష్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఆర్సీబీ కి దినేష్ ఇప్పుడు అత్యంత విలువైన ఆటగాడు. అనేక కీలక మ్యాచ్ ల్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు కార్తీక్.
Video Advertisement
ఈ సీజన్ లో ఆర్సీబీ ప్లేఆఫ్ కి చేరినందు వల్ల డీకే నుంచి మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ చూసే అవకాశం ఉంది. అయితే మీరెప్పుడైనా గమనించారా.. దినేష్ వాడే హెల్మెట్ ఇతర బ్యాటర్స్ కి డిఫరెంట్ గా ఉండడాన్ని?
దీనికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు కానీ హెల్మెట్ యొక్క బరువు (తేలికగా ఉండడం) కారణం అవ్వొచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ రూల్స్ కి కట్టుబడి ఉన్నంత వరకూ పరికరాల ఎంపిక ఆటగాడి వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.
డీకే ఈ రకమైన హెల్మెట్ వాడడం ఇదే తొలిసారి కాదు. అతని వికెట్ కీపింగ్ హెల్మెట్ కూడా ఇతర కీపర్లకు భిన్నంగా ఉన్న సందర్భాలు అనేకం.
అంతర్జాతీయ క్రికెట్ (ICC), IPL రెండింటిలోను అనేక సందర్భాల్లో కార్తీక్ బేస్ బాల్-రకం ఫేస్ ప్రొటెక్టర్ గార్డ్ ధరించి కనిపించాడు. ఇది క్రికెట్ నిబంధనల ద్వారా అనుమతించబడుతుంది. కేవలం దినేష్ కార్తీక్ మాత్రమే కాదు. అతని మాజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు రాహుల్ త్రిపాఠి (ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్నాడు) కూడా ఇదే రకమైన బ్యాటింగ్ హెల్మెట్‌ని ధరిస్తాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్లు జేమ్స్ టేలర్ మరియు మైఖేల్ కార్బెర్రీ కూడా అప్పట్లో ఇటువంటి హెల్మెట్‌లను ధరించేవారు. ఈ సీజన్ లో దినేష్ ఫామ్ చూసి ఏబీ డేవిలిర్స్ సైతం నాకు మళ్ళీ క్రికెట్ ఆడలనిపిస్తుంది అని ట్విట్ చేసాడు అంటే డీకే ఏ రేంజ్ లో బ్యాట్ ఝుళిపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మంచి నీళ్ళు తాగినంత సులువుగా సిక్సర్స్, ఫోర్స్ తో విరుచుకు పడుతూ, ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి చెలరేగిపోతున్న కార్తీక్ త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టి20 సిరీస్ కు ఎంపికవ్వడం విశేషం.
ఆర్ సీబీకీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన బెస్ట్ ఫినిషర్ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఇందులో 14 మ్యాచులు ఆడితే 57.40 సగటున287 పరుగులు చేసి చాలా మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించడం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ వెళ్ళిపోయింది. బుధవారం రోజున లక్నో సూపర్ జాయింట్స్ మరియు రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. లో ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ని ఓడించి ఐపీఎల్ ఫైనల్స్ కి మరో అడుగు దూరంలో ఉంది. రాజస్థాన్ తో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడబోతుంది.
గత మూడు సంవత్సరాలుగా విరామం తీసుకున్న తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ట్విట్ చేసి క్రికెట్ లవర్స్ కు తీపి కబురు అందించారు అని చెప్పవచ్చు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆయనకు వెల్కమ్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “మనపై మనకు నమ్మకం ఉంటే మాత్రం ప్రతిది మనం అనుకున్నట్లుగా” జరుగుతుందని అన్నారు. కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే నాకు మరో అవకాశాన్ని కల్పిస్తున్న సెలెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉత్సాహంతోనే నేను హార్డ్ వర్క్ ను కంటిన్యూ చేస్తాను అంటూ దినేష్ కార్తీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా అయిన రీ ఎంట్రీ ఇవ్వడంతో నెట్టింట్లో దినేష్ కార్తీక్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
If you believe yourself, everything will fall into place! ✨
Thank you for all the support and belief…the hard work continues… pic.twitter.com/YlnaH9YHW1— DK (@DineshKarthik) May 22, 2022
End of Article