రైలు పట్టాల పక్కన ఉండే బోర్డులపై W/L అని ఎందుకు ఉంటుందో తెలుసా..? దీనివల్ల ఉపయోగం ఏంటంటే?

రైలు పట్టాల పక్కన ఉండే బోర్డులపై W/L అని ఎందుకు ఉంటుందో తెలుసా..? దీనివల్ల ఉపయోగం ఏంటంటే?

by Mounika Singaluri

Ads

రైలు ప్రయాణాలు మనకి కొత్తేమి కాదు. ఎంతో హుషారు గా కిటికీ పక్కన కూర్చుని రైల్లో వెళ్ళడానికి మనందరం ఇష్టపడతాం. అదే సమయం లో రైలు పట్టాలకు పక్కగా రకరకాల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఓ బోర్డుపై W/L అని రాసి ఉంటుంది. అయితే.. ఇలా ఎందుకు రాసి ఉంటుంది అన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..?

Video Advertisement

వాస్తవానికి ఈ బోర్డుని ప్రజల భద్రతా కోసమే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఆశ్చర్యంగా ఉందా..? ఈ బోర్డులు మన భద్రతకు ఎలా ఉపయోగపడతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

railway 1

మొదట ఈ బోర్డుకి అర్ధం ఏమిటో తెలుసుకుందాం. W/L అంటే విజిల్ / లెవెల్ బోర్డు అని అర్ధం. భారతీయ రైల్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బోర్డు లోకో పైలట్లను అప్రమత్తం చేయడం కోసం ఏర్పాటు చేసారు. రైలు పట్టాల వద్ద మ్యాన్ క్రాసింగ్ లేదా అన్ మ్యాన్ క్రాసింగ్ ఉన్న చోట్ల ఈ గుర్తును ఏర్పాటు చేస్తారు.

railway 2

ఈ బోర్డు గుండా వెళ్లే ప్రతి సారీ లోకో పైలట్ తప్పని సరిగా హారన్ కొట్టాల్సి ఉంటుంది. ఈ బోర్డు పసుపు రంగులో ఉంటుంది. దీనిపైన నల్లని అక్షరాలతో రాస్తారు. తద్వారా ఎంత దూరంలో ఉన్నా ఈ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. జనాలని ప్రమాదం బారిన పడకుండా ఉండడం కోసం రైల్వే డ్రైవర్ ఈ బోర్డు మీదుగా వెళ్ళేటపుడు హారన్ మోగిస్తూ ఉంటాడు. నిబంధనల ప్రకారం.. ఈ బోర్డులను 2.100 మిమీ ఎత్తులో రెండు బోర్డులను పెట్టాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇంగ్లీష్ లో ఉంటె.. మరొకటి హిందీలో ఉండాలి.


End of Article

You may also like