సొంత కూతురునే గొలుసుతో కట్టేస్తుంది.. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు.. అసలు కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు పెడతారు..!

సొంత కూతురునే గొలుసుతో కట్టేస్తుంది.. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు.. అసలు కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు పెడతారు..!

by Anudeep

Ads

ఏ తల్లి అయినా తన కన్న కూతురు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ఆమె తన కూతురిని స్వేచ్ఛగా పెంచుతూనే మరో వైపు రక్షణ కూడా కల్పిస్తూ ఉంటుంది. తనలా కాకుండా తన కూతురు స్వేచ్ఛగా పెరగాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. కానీ ఈ తల్లికి మాత్రం ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. అందుకే తన కూతురుని తానె గొలుసుతో కట్టి బంధించాల్సి వస్తోంది.

Video Advertisement

ఏ తల్లికీ రాకూడని కష్టం నాది. ఆమె కాళ్లకు సంకెళ్లు వేస్తుంటే.. నా గుండెకు సంకెళ్లు వేస్తున్నట్లు అనిపిస్తుంది.. అంటూ ఆమె తన దీన గాధ చెబుతుంటే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.

women 1

ఆమెకు భర్త లేడు. ఉన్న ఒక్క కూతురు మానసిక వికలాంగురాలు. మూడిళ్లల్లో పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న జీవితం ఆమెది. అక్కడికీ ఖర్చు అయినా.. పిల్లని ఎన్నో ఆసుపత్రుల్లో చూపించానని.. కానీ ఫలితం లేకుండా పోయిందని ఆమె తన గొడ్డుని వెళ్లబోసుకుంది. మొదట్లో ఇంట్లోనే ఉంచి పనికి వెళ్లేదాన్ని. తిరిగి వచ్చేసరికి ఆమె వీధిబాలల వద్ద కనిపించేది.

women 2

ఒకసారి ఇంట్లోనే కనిపించలేదు. ఆమె కోసం వెతకని చోటు లేదు. ఓ చెత్త కుప్ప దగ్గర కనిపించింది. ఆమె వంటిపై శారీరకంగా దాడి చేసినట్లు గుర్తులు కనిపించాయి. తనకి ఏమి జరిగిందో కూడా తెలుసుకునే పరిస్థితిలో నా కూతురు లేదు. నన్ను చూడగానే ఏమి తెలియనట్లు బోసినవ్వులు చిందిస్తుంటే ఏమి చెయ్యాలో తెలియలేదు. ఒళ్ళంతా రక్తం కారుతున్న అమాయకంగా నవ్వుతూనే ఉంది. నా గుండె తరుక్కుపోయింది. అందుకే ఆమెని ఇంట్లో ఉంచి బయటకి వెళ్ళేటప్పుడు కాళ్లకు సంకెళ్లు వేసి వెళుతుంటాను. ఆమెను రక్షించుకోవడం కోసం ఆమె కాళ్ళకి, నా గుండెకి ఈ సంకెళ్లు తప్పవు.


End of Article

You may also like