ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న  జరగబోతుంది.

Video Advertisement

టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆడనుంది. 5 సార్లు ఐపీఎల్ విజేత అయిన రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ఆడనుంది. 2011 వన్డే ప్రపంచకప్ విజేత అయిన భారత జట్టు టైటిల్ ఫెవరెట్. అయితే 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్ లో రెండు సార్లు టాస్ వేశారట. ఆ వివరాలు ఇప్పడు చూద్దాం..
13వ ఎడిషన్ వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌ సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మధ్య జరుగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు కొందరు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. మిగతా ఆటగాళ్లు బుధవారం రానున్నారు. వీసాలు ఆలస్యం కావడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనడానికి వచ్చే జట్లకు కావాల్సిన వసతిని బీసీసీఐ అధికారులు ఏర్పాటు చేశారు.
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో 10 జట్లు పోటీపడబోతున్నాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వారి జట్లని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీల విశేషాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలా 2011 వరల్డ్ కప్ లో 2 సార్లు టాస్ వేసారనే విషయం వార్తల్లో నిలిచింది.
2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకను ఓడించి రెండవ వన్డే వరల్డ్ కప్ ను సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అయితే ఫైనల్‌ మ్యాచ్ కి రిఫరీగా ఉన్న జెఫ్ క్రోనీ, టాస్ వేసే సమయంలో శ్రీలంక సారధి సంగర్కర హెడ్ అని చెప్పగా, ఫ్యాన్స్ అరుపుల వల్ల అది వినలేకపోయాడు. హెడ్ పడడంతో టాస్ గెలిచిన సంగర్కర, బ్యాటింగ్ ఎంచుకుంటానని అన్నారట.
కానీ రిఫరీ జెఫ్ క్రోనీ, సంగర్కర చెప్పింది వినబడలేదని, రెండవసారి టాస్ వేయాల్సిందిగా చెప్పారంట. అందుకు భారత కెప్టెన్ ధోనీ కూడా అంగీకరించడంతో రెండోసారి టాస్ వేశారు. అప్పుడు కూడా సంగర్కర హెడ్ అని చెప్పగా, హెడ్ పడడంతో శ్రీలంక టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకను ఓడించి, 28 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచ కప్ సాధించింది.

Also Read: “విరాట్ కోహ్లీ” జాతకం ప్రకారం… ఈ సారి ఇండియా “వరల్డ్ కప్” గెలుస్తుందా..?