Ads
ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో పలు సంచలనాలు, రికార్డులు నమోదు అయ్యాయి. టీంఇండియా టోర్నీ ఆరంభం నుండి ఓటమి లేకుండా, వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
Video Advertisement
గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్, శ్రీలంక పై విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ గెలుపుతో సెమీస్ కు వెళ్ళే టీమ్స్ పై స్పష్టత వచ్చింది. అయితే ఫైనల్స్ కు వెళ్ళే రెండు జట్లు ఇవే అంటూ అందరూ అంచనాలు వేస్తున్నారు. ఆ రెండు జట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే సెమీస్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ ఆడిన 8 మ్యాచ్ లలో అన్ని గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో సౌతాఫ్రికా జట్టు 12 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లతో, 0.861 నెట్ రన్ రేట్ తో మూడవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ శ్రీలంక పై గెలుపుతో పది పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఏదో వండర్ జరిగితే తప్ప సెమీ ఫైనల్ కు వెళ్ళడం అసంభవం.
ఈ క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్ కు వెళ్ళే రెండు జట్లు పై ఉంది. ప్రస్తుతం జట్టుకు ఫామ్ ను బట్టి, బలాబలాలు బట్టి భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంటాయని అంటున్నారు. దీంతో 2003 ప్రపంచ కప్ ఫైనల్ రిపీట్ కాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ భారత్, ఆస్ట్రేలియా జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. 2003 ప్రపంచ కప్‌లో కూడా భారత్, ఆస్ట్రేలియా జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా మంచి ఫామ్ లో ఉన్నా, లీగ్ దశలో రెండు తడబడటం కనిపించింది.
భారత్ తడబాటు లేకుండానే సెమీస్ కు చేరుకుంది. ఆసీస్ మొదట్లో తడబడినప్పటికీ ఏమాత్రం వెనక్కు వెళ్ళలేదు. ఇక ఈ టోర్నీలో సౌతాఫ్రికా తడబడటం తెలిసిందే. అందువల్ల ఆస్ట్రేలియా రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడిస్తుందని అనుకుంటున్నారు. అలా జరిగితే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓటమి పలు చేసి భారత్ ప్రపంచ కప్ ను అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
Also Read: నిన్ను విరాట్ అవుట్ చేసాడనే కదా… నీకు ఈ ఏడుపు..? పాకిస్తాన్ ప్లేయర్ కి స్ట్రాంగ్ కౌంటర్..!
End of Article