సాధారణంగా ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి సినిమా, ఇంకొకటి క్రికెట్. ఈ రెండిట్లో సినిమాలకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో, క్రికెట్ కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో చెప్పడం కష్టం. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అయితే వాళ్లు చెప్పకుండానే అందరికీ తెలిసిపోతాయి.

Video Advertisement

అదే విధంగా క్రికెటర్ల జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్లు చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరి దృష్టికి వచ్చేస్తాయి. ఇందులో ముఖ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చేవి వాళ్ల రిలేషన్ షిప్ వివరాలు. అలా కొంత మంది యంగ్ క్రికెటర్స్, ఇంకా వాళ్లు రిలేషన్ లో ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

#1 పృథ్వీ షా

ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడారు పృథ్వీ షా. పృథ్వీ షా ప్రాచీ సింగ్ తో రిలేషన్ లో ఉన్నారు. ప్రాచీ సింగ్ ఒక నటి. కలర్స్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఉడాన్ సీరియల్ లో నటించారు.

#2 రాహుల్ చహర్

ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడిన రాహుల్ చహర్ కి, డిసెంబర్ 13, 2019 లో తన గర్ల్ ఫ్రెండ్ ఇషాని తో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇషాని గురించి వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు. కానీ రాహుల్ చహర్ ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

#3 శుబ్మన్ గిల్

ఐపీఎల్ 2020 లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడారు శుబ్మన్ గిల్. శుబ్మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే పుకార్లు వినిపించాయి. అంతే కాకుండా గూగుల్ లో శుబ్మన్ గిల్ వైఫ్ అని సెర్చ్ చేస్తే సారా టెండూల్కర్ ఫొటోస్ , అలాగే వాళ్లిద్దరికీ సంబంధించిన వార్తలు కనిపించాయి. కానీ ఏదేమైనా ఇవి కేవలం పుకార్లు మాత్రమే. శుబ్మన్ గిల్, సారా టెండూల్కర్ కూడా వీటి గురించి ఎక్కడా స్పందించలేదు.

#4 ఇషాన్ కిషన్

ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఇషాన్ కిషన్, అదితి హుండియా తో రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అదితి హుండియా ఒక మోడల్. 2017 లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొన్నారు. అందులో మిస్ ఇండియా రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నారు. అలాగే 2018 లో మిస్ దివా – 2018 కాంపిటీషన్ లో పాల్గొన్నారు. మిస్ దివా సుప్రానేషనల్ కిరీటం పొందారు.

#5 రిషబ్ పంత్

ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడిన రిషబ్ పంత్, ఇషా నేగి తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇషా నేగి ఒక ఎంట్రప్రెన్యూర్, అలాగే ఒక ఇంటీరియర్ డెకర్ డిజైనర్.