చాహల్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన సెలెక్టర్లు..? ఇప్పుడు చాహల్ ఏం చేయబోతున్నాడు..?

చాహల్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన సెలెక్టర్లు..? ఇప్పుడు చాహల్ ఏం చేయబోతున్నాడు..?

by Mounika Singaluri

Ads

ఇండియన్ క్రికెట్ టీం లో యుజ్వేంద్ర చాహల్ కి  ఇక చోటు కష్టం గానే కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకు జట్టులో చాహల్ కి చోటు తప్పనిసరిగా ఉండేది. చాహల్ లేని మ్యాచ్ ఉండేది కాదు. అయితే ఇటీవల చాహల్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోకపోవడంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేశారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కి కూడా చాహాల్ ను సెలెక్ట్ చేయలేదు.

Video Advertisement

2016లో భారత టీమ్ లోకి అడుగుపెట్టిన చాహాల్ తర్వాత వన్డేలు, t20 లోను రెగ్యులర్ బౌలర్ గా మారిపోయాడు. క్రికెట్ లో హాఫ్ స్పిన్నర్లు జోరు తగ్గి, మనికట్టు స్పిన్నర్లకు ప్రాధాన్యం పెరిగిన తర్వాత టీంలో చాహల్, కులదీప్ లను రెగ్యులర్ గా ఆడించేవారు. మధ్యలో కులదీప్ ఫామ్ కోల్పోయిన కూడా చాహలకి మాత్రం చోటు దక్కేది. ఉండగా ఉండగా చాహల్ తన ప్రభావం చూపలేక పోయాడు.


2021లో 16 వన్డేలు ఆడిన చాహాల్ కేవలం 24 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గత ఏడాది వరకు ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న చాహల్ , తర్వాత జనవరిలో జరిగిన టీం సెలక్షన్స్ లో చోటు మాత్రం దక్కించుకోలేకపోయాడు. అలా ప్రపంచకప్ కి కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా టి20 లో కూడా చాహాల్ ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.ప్రస్తుతం చాహాల్ వయసు 33 సంవత్సరాలు. ఫామ్ లో ఉంటే టి20 లో కూడా ఆడించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే టి20 లకు కుర్రాళ్లయిన వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణనోయ్ లకి సెలక్టర్లు అవకాశం కల్పించారు.

వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్పును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీం కూర్పు జరుగుతుంది. చాహల్ మళ్లీ టి20 లో చోటు దక్కించుకోవాలంటే దేశీవాలి మ్యాచ్ ల్లోనూ, ఐపిఎల్ లోనూ బాగా రాణించాల్సి ఉంటుంది.టీంలో చోటు దక్కించుకోవాలని చాహల్ కసిగా పనిచేస్తున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో తాజాగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇదే కసి కొనసాగిస్తే సెలెక్టర్లు చాహల్ ను పరిగణలోకి తీసుకుంటారు లేదంటే అంతర్జాతీయ క్రికెట్లో చాహల్ కెరీర్ ముగిసినట్లే.

 

Also Read:ఫైనల్ మ్యాచ్ లో “రోహిత్ శర్మ” ఔట్ కాదా..? భలే మోసం చేశారుగా..? మనమే గెలిచేవాళ్లం..!


End of Article

You may also like