పాక్‌పై జింబాబ్వే విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. అయితే బీన్స్ విషయాన్ని జింబాబ్వే సీరియస్ తీసుకుంది. అందుకే రివెంజ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్‌ జింబాబ్వే మ్యాచ్ కి ముందే పాక్ ని ఓడిస్తామని అన్నారు జింబాబ్వే అభిమాని.

Video Advertisement

తాను చెప్పినట్టే పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇక బీన్ వివాదం ఏమిటనేది చూస్తే.. 2016లో జింబాబ్వే కి మిస్టర్ బీన్ పంపకుండా పాకిస్థాన్ ఫేక్ బీన్‌ను పంపింది.

పోలీసులు రక్షణ ఇవ్వడంతో పాటు అతను అగ్రికల్చర్ షోలో పాల్గొన్నాడని అన్నారు జింబాబ్వే అభిమాని చసురా. ఇదిలా ఉంటే మీకు రియల్ సికిందర్ రజాను ఇచ్చాము అని ఓ పాకిస్తాన్ అభిమాని అన్నాడు. కానీ చసురా ”రజా మీపై ఎలాంటి జాలి చూపించడు” అని వార్నింగ్ ఇచ్చాడు. అలానే రజా మూడు వికెట్లు ఈ మ్యాచ్ లో తీసాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అయ్యాడు. పాకిస్థాన్ జట్టు బలమైనదైనా ఓడించింది జింబాబ్వే. ఫేక్ బీన్‌ను పంపి మోసారని ఇలా ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారు.

అలానే పాకిస్తాన్ పై విజయం అందుకున్నాక చసురా ట్వీట్లకు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించడం విశేషం. ఫ్రాడ్ బీన్‌ను ఇచ్చినందుకు పాక్‌పై మంచిగా రివెంజ్ తీర్చుకున్నారని ప్రశంసించారు వీరేంద్ర సెహ్వాగ్. పైగా చసురా వర్షం అయినా మిమ్మల్ని గెలిపించచ్చేమో అని ప్రార్ధించమని సెటైర్లు వేసాడు.

రియల్ బీన్‌ను పంపిస్తామని పాకిస్తాన్ ఫ్యాన్స్ అంటే… త్వరగా పంపడం మంచిది లేదంటే బాబర్ ఆజమ్ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చసురా హెచ్చరించాడు. తాను చెప్పినట్టే బాబర్ ఓటమిని ఎదుర్కొన్నాడు. నేను ముందే చెప్పా వినలేదని చసురా మళ్ళీ గెలిచాక ట్వీట్ చేసాడు.