Ads
పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఒక మధురమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరికీ వారు వారి స్థాయిని బట్టి అంగరంగ వైభవం గా పెళ్లి ని వేడుకగా చేసుకుంటారు. ఐతే..సామాన్యులతో పోలిస్తే సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ కాస్ట్లీగానే ఉంటుంది. అయితే.. వీరు చేసుకునే పెళ్లి వేడుకలు కూడా చాలా కాస్ట్లీ గానే ఉంటాయి. ఇప్పుడు మనం అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు చేసుకున్న ఆరుగురు ఇండియన్ క్రికెటర్లు ఎవరో చూద్దాం..
Video Advertisement
#1 మహేంద్ర సింగ్ ధోని & సాక్షి సింగ్ రావత్:
ధోని, సాక్షి సింగ్ రావత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ జూన్ 4 , 2010 లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి చాలా మంది బాలీవుడ్ యాక్టర్లు, సెలెబ్రిటీలు, సన్నిహితులు, ఫామిలీ మెంబెర్స్ అటెండ్ అయ్యారు. వీరు ఇందుకోసం దాదాపు ఇరవై కోట్ల ఖరీదైన లావిష్ హాల్ ను బుక్ చేసారు. పెళ్లి కోసం ధోని కొనుక్కున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..? అక్షరాలా యాభై లక్షల రూపాయలు. సాక్షి డ్రెస్ ఖరీదు అరవై లక్షల రూపాయలు.
#2 విరాట్ కోహ్లీ & అనుష్క శర్మ:
కోహ్లీ, అనుష్క శర్మలది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరూ ఇటలీ లో డిసెంబర్ 11 వ తేదీన సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి సీక్రెట్ గానే చేసుకున్నా.. సన్నిహితుల మధ్యన చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. వీరి వెడ్డింగ్ కార్డు ను కూడా చాలా ప్రత్యేకం గా డిజైన్ చేసారు. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు కోసం 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. వీరు బోర్గో ఫినోచియోటో రిసార్ట్ ను కూడా బుక్ చేసుకున్నారు. ఈ రిసార్ట్ లో వన్ నైట్ కి 13.5 లక్షలు ఖర్చు అయిందట. వీరిద్దరి వెడ్డింగ్ డ్రెస్ కి కూడా నలభై లక్షలు ఖర్చు అయ్యిందట.
#3 జస్ప్రీత్ బుమ్రా & సంజన గణేశన్:
జస్ప్రీత్ బుమ్రా స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఐన సంజన గణేశన్ ను మార్చి 16, 2021 న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు తమ వివాహాన్ని సన్నిహితుల సమక్షం లోనే చేసుకున్నారు. వెడ్డింగ్ కోసం బుమ్రా మనీష్ మల్హోత్రా నుంచి డిజైన్ చేయించుకున్న దుస్తులు పది లక్షల వరకు ఖరీదు చేస్తాయి. పెళ్లి కోసం బుమ్రా పది కోట్ల వరకు ఖర్చు చేసాడని తెలుస్తోంది.
#4 యువరాజ్ సింగ్ & హాజెల్ కీచ్ :
యాక్ట్రెస్ హాజెల్ కీచ్ ను యువరాజ్ సింగ్ నవంబర్ 30 వ తేదీ 2016 లో వివాహం చేసుకున్నారు. వెడ్డింగ్ కి యువరాజ్ క్వాడ్ బైక్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గోవా లో ఖరీదైన వేదిక పై వీరు వివాహం చేసుకున్నారు. ఇందుకోసం యువరాజ్ సింగ్ ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసారు. హాజెల్ వేసుకున్న నగల ఖరీదు కూడా పదికోట్ల రూపయల వరకు ఉంటుందట. వీరి వెడ్డింగ్ డ్రెస్ లను కూడా మనీష్ మల్హోత్రానే డిజైన్ చేసారు. యువరాజ్ వెడ్డింగ్ డ్రెస్ 20 లక్షలు ఉండగా.. హాజెల్ వెడ్డింగ్ డ్రెస్ కోటి రూపాయల విలువ చేస్తుంది.
#5 యుజ్వేంద్ర చాహల్ & ధనశ్రీ వర్మ:
వీరు గురుగ్రామ్ లో 22 వ తేదీ డిసెంబర్ 2020 లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ పెళ్లి కోసం తరుణ్ తహిలాని అవుట్ ఫైట్స్ ను ధరించారు. ఈ వెడ్డింగ్ కోసం ధనశ్రీ వేసుకున్న లెహంగా ఒక్కటే ఆరు లక్షల ఖరీదు చేస్తుంది.
#6 రోహిత్ శర్మ & రితిక సజ్దే:
వీరిద్దరూ 13 డిసెంబర్ 2015 లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక కూడా క్రికెట్, బాలీవుడ్, బిజినెస్ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో వీరు గ్రాండ్ రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
End of Article