అంత ప్రమాదంలోనూ ఈ అమ్మాయి తెలివిగా చేసిన పని చూస్తే “హ్యాట్సాఫ్” అంటారు..!

అంత ప్రమాదంలోనూ ఈ అమ్మాయి తెలివిగా చేసిన పని చూస్తే “హ్యాట్సాఫ్” అంటారు..!

by Anudeep

Ads

ఇది ఒక దారుణమైన ఘటన. అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరో పెనువిషాదం నింపింది. టెక్సాస్ లో యువాల్డి పట్టణంలో రాబ్ ప్రాథమిక పాఠాశాలలో ఓ 18ఏళ్ల దుండగుడు చోరబడి అక్కడ చిన్నారులు , టీచర్స్ పై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఎంతో మంది చిన్నారులు, టీచర్లు ఉన్మాది చేతిలో బలైపోయారు. అమెరికా కాలమలం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది

Video Advertisement

ఈ మారణహోమం నుంచి 11 సంవత్సరాల చిన్నారి ఎంతో సమయస్ఫూర్తితో బయటపడింది. తాను ఏవిధంగా ఉన్మాది చేతుల నుంచి ప్రాణాలు రక్షించుకుందో తన తండ్రికి చెప్పిన మాటలివి. ఆమె చెప్పిన ఈ మాటలకు అందరి హృదయం కలచివేసింది. మియా సెర్రిల్లో ఎప్పటిలాగానే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ కి తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. టీచర్లు పాఠం చెబుతుంటే ఆ సమయంలో ఒక దుండగుడు చొరబడి అంతం అందరి మీదకు కాల్పులు జరపగా, ఒక్కొక్కరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన చూస్తున్న మియా అయోమయంలో  మునిగిపోయింది. ఇలా చూస్తూ ఉండగానే ఆమె క్లాస్ టీచర్ ఒంటిలో నుంచి తూట దూసుకు వచ్చింది. టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Texas gun shooting

ఆ వెంటనే ఆమె స్నేహితురాలు కూడా కుప్పకూలిపోయింది. ఇక తను కూడా చంపేస్తాడు అని ఆ చిన్నారికి వణుకుతో భయం మొదలైంది. వెంటనే తన చనిపోయిన స్నేహితురాలు ఒంటి మీద రక్తం తీసుకొని తన ఒంటికి రాసుకుంది. కిందపడి చనిపోయినట్లు నటించింది. ఆ దుండగుడు అందరూ చనిపోయారా లేదంటూ కాళ్లతో తన్నుకుంటూ పరీక్షించుకొని మరీ  క్లాస్ లో నుండి బయటికి వెళ్ళగానే టీచర్ చేతిలోని మొబైల్ ఫోన్ తీసుకొని 911 ఎమర్జెన్సీ నెంబర్ కి ఫోన్ చేసినట్లు వెల్లడించింది.

Texas gun firing

దాడిలో జరిగిన కాల్పుల వలన స్వల్పంగా గాయపడిన మియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం కోలుకుంది. జరిగిన ఘటన వల్ల ఆమెకు ఇంకా భయమనేది తగ్గలేదు. 19 మందిని పొట్టన పెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్ ను మట్టుపెట్టడానికి  టెక్సాస్ పోలీసులు గంట సమయం తీసుకుంటున్నారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మియా సమయస్ఫూర్తితో వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది.


End of Article

You may also like