4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చిన బౌలర్…అదెలా? అసలేమైంది?

4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చిన బౌలర్…అదెలా? అసలేమైంది?

by Megha Varna

Ads

కోపం అనర్థాలకు దారి తీస్తుంది అని మన పెద్దలు చెప్పింది నిజమే అని కొన్ని సంఘటనలు చూస్తే అనిపిస్తుంది.తాజాగా ఇలాంటి ఓ సంఘటనే బంగ్లాదేశ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నమోదైంది.అది చూసిన వారంతా ఇదేం విడ్డూరం రా బాబు అంటూ షాక్ తింటున్నారు.మరి అంతగా అందరిని షాక్ కి గురి చేస్తున్న ఆ సంఘటనే ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

Axiom మరియు Lalmatia టీమ్స్ మధ్య జరిగిన ప్రీమియర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన Lalmatia టీమ్ 14 ఓవర్స్ లో 88 పరుగులు చేసింది.ఆతరువాత Lalmatia నుండి తొలి ఓవర్ వేసిన సుజొన్ మహమూద్ బౌలింగ్ లో మొదటి నాలుగు బంతులలో 12 రన్స్ స్కోర్ చేశారు. ఆతర్వాత 65 వైడ్స్ మరియు 15 నో బాల్స్ వేశాడు.ఈ విధంగా సుజొన్ మహమూద్ నాలుగు బంతులలో 92 పరుగులు ఇచ్చాడు.

 

ఈమ్యాచులో Lalmatia క్యాప్టెన్ టాస్ సమయంలో కాయిన్ చూడడానికి అనుమతించలేదు.అలాగే Lalmatia బ్యాటింగ్ చేస్తున్న టైంలో వాళ్లకు వ్యతిరేకంగా బోలెడు తప్పుడు నిర్ణయాలు వెలువడ్డాయి.దీనికి నిరసనగా సుజొన్ అలా బౌలింగ్ చేశాడని వాళ్ళ టీమ్ కోచ్ డిపొన్ అన్నారు.ఇంతకముందు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఈ రికార్డ్ న్యూజలాండ్ బెర్ట్ వ్యాన్స్ పేరు మీద ఉంది.ఇతను 22 బంతులలో 77 రన్స్ ఇచ్చాడు.

లాల్మాటియా క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ అదనన్‌ రెహమాన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ… తాము కావాలనే ఇలా చేశామని అన్నారు. ఈ మ్యాచ్ లో టాస్‌ ఎవరు గెలిచారో కూడా తమ కెప్టెన్‌ను అంపైర్లు చూడనివ్వలేదని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కోపమొచ్చి 4 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేశామని వ్యాఖ్యానించారు.


End of Article

You may also like