Ads
సచిన్ టెండూల్కర్ గురించి మనం కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. టెండూల్కర్ చాలా ఫేమస్ క్రికెటర్. తన ఆటతో భారతదేశంలో ఎంతో మంది మనసుల్ని దోచుకున్నాడు టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ని కూడా ఇచ్చి గౌరవించారు. పైగా ఈ అవార్డును పొందిన ప్రధమ క్రీడాకారుడిగా మరో రికార్డు నెలకొల్పాడు టెండూల్కర్.
Video Advertisement
నిజంగా ఇంత పెద్ద అవార్డు రావడం సాధారణ విషయం కాదు. సచిన్ టెండూల్కర్ 1988 లో మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరఫున ఆడి గుజరాత్ పై 100 పరుగులు సాధించాడు. ఇలా సచిన్ సాధించిన రికార్డులకు కొదవే లేదు. అయితే.. ఆయన సాధించిన ఓ 7 భారీ రికార్డు లను మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ క్రాస్ చేయలేదు. ఆ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
# అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత సచిన్ కె తగ్గుతుంది. మొత్తం 264 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులను చేసాడు. సచిన్ కౌంట్ ని ఇప్పటివరకు ఎవరూ క్రాస్ చేయలేదు.
# వన్డే లేదా టెస్టు క్రికెట్లో కూడా ఎక్కువ పరుగులు చేసిన ఘనత సచిన్ దే. సచిన్ తన క్రికెట్ కెరీర్ లో మొత్తం 34357 పరుగులు చేసారు. ఈ నెంబర్ ని ఇంకా ఎవరు అధిగమించలేదు.
# అలాగే అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా కూడా సచిన్ కు పేరు వచ్చింది. సచిన్ తన కెరీర్ లో మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు.
# బ్యాటింగ్ ఆర్డర్ లో ఒక స్థానంలో ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సచిన్ కు రికార్డు ఉంది. 275 ఇన్నింగ్స్‌లలో 54.40 సగటుతో మొత్తం 13492 పరుగులు చేసిన ఘనత ఒక్క సచిన్ కె దక్కుతుంది.
# అలాగే.. టెస్ట్ క్రికెట్ లో కూడా అత్యధిక ఫోరులు కొట్టిన ఘనత ఒక్క సచిన్ కె చెందుతుంది. మొత్తం రెండువేలకు పైగా అనగా 2058 ఫోర్లు టెస్ట్ క్రికెట్ మ్యాచ్స్ లోనే కొట్టాడు.
# అలాగే అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ టైటిల్స్ రికార్డు కూడా సచిన్ కె సొంతం. వన్ డే సిరీస్ కెరీర్ లో 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్ ను సచిన్ గెల్చుకున్నారు.
# అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ను కూడా ఎక్కువగా అందుకుంది సచిన్ మాత్రమే. మొత్తం తన కెరీర్ లో 62 సార్లు సచిన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ ను గెల్చుకున్నారు.
End of Article