Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. మీరెప్పుడైనా గమనించారా..? క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాట్స్ మెన్ తన బ్యాట్ తో పిచ్ ని పరిశీలించి చూస్తుంటారు. ఇలా పిచ్ ని బ్యాట్ తో ఎందుకు పరిశీలిస్తారో తెలుసా..? ఈరోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం. కొన్ని సినిమాలలో కూడా సరదాకి బ్యాట్స్ మెన్ ఇట్లా బ్యాట్ తో పిచ్ ని టచ్ చేసినట్లు చూపించారు. చాలామంది ఇట్లా బ్యాట్ తో షో చేస్తున్నారు అని అనుకుంటాం.
కానీ ఇది షో చేయడం కాదు. మ్యాచ్ ని స్టార్ట్ చేయడానికి ముందే పిచ్ ను సరిగ్గా చదును చేసి ఉంచుతారు. కానీ ఎక్కడైనా రఫ్ ప్యాచ్ లు ఉన్నా, ఉబ్బెత్తుగా ప్యాచ్‌లు ఉన్నా అలాంటి వాటిని బ్యాట్స్ మెన్ తమ బ్యాట్స్ తో సరి చేస్తూ ఉంటారు. ఇలా చేయడానికి మరొక కారణం కూడా ఉంది. కొందరు బ్యాట్స్ మెన్ అవసరం లేకున్నా అలా మధ్యలోకి వచ్చి సరిచేస్తుంటారు.
దీనివల్ల బౌలర్ రిథమ్ దెబ్బ తింటుందని, సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతారని నమ్ముతారు. కొందరు బ్యాట్స్ మెన్ కూడా ఇలా కావాలనే చేస్తూ ఉంటారు. తమకు ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడం కోసమే.. ఆట మధ్యలో ఇలా పిచ్ మీదకు వచ్చి సరి చేస్తున్నట్లుగా చేస్తూ.. తమ ఒత్తిడిని తగ్గించుకుంటుంటారు.
End of Article