ఇండియాలో మ్యాచ్ జరిగితే.. రెండు సీట్లు లతా మంగేష్కర్ కోసమే ఖాళీగా ఉంచుతారు.. ఎందుకో తెలుసా..?

ఇండియాలో మ్యాచ్ జరిగితే.. రెండు సీట్లు లతా మంగేష్కర్ కోసమే ఖాళీగా ఉంచుతారు.. ఎందుకో తెలుసా..?

by Anudeep

Ads

లతా మంగేష్కర్ ఇటీవలే ఈ లోకాన్ని వీడి వెళ్లారన్న వార్తని అభిమానులు ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ అనారోగ్యంతో నిన్న మృతి చెందిన సంగతి విదితమే. మరో వైపు అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

Video Advertisement

ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోడీ తో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. సోషల్ మీడియా అంతా ఆమె గురించిన కధనాలు హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ఆమెను వేనోళ్ళ కీర్తిస్తున్నారు.

latha mangeshkar

latha mangeshkar

చాలా మందికి లత మంగేష్కర్ గారి వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఆమె సినీ ఇండస్ట్రీ లో దాదాపు 80 ఏళ్లపాటు కొనసాగింది. కానీ, ఇన్నేళ్ళలో ఆమె పై ఒక్క రూమర్ కూడా రాలేదు. ఆమె వ్యక్తిగత ప్రేమ గురించిన మాటలు కొన్ని అక్కడక్కడా వినిపించినా ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఎటువంటి వివాదానికి ఆమె జీవితంలో తావులేదు. ఇది ఇలా ఉంచితే, లతా మంగేష్కర్ క్రికెట్ కు వీరాభిమాని. ఆమెకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. 1983 లో భారత జట్టు వరల్డ్ కప్ ని గెలిచింది.

latha mangeshkar

latha mangeshkar

దేశమంతా సంతోషంలో మునిగిపోయింది. కానీ, ఆ టైం లో భారత జట్టుకి బీసీసీఐ ఏ విధమైన నగదు బహుమతిని ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈ పరిస్థితిలో లతా మంగేష్కర్ ఆరోజుల్లోనే దాదాపు ఇరవై లక్షలని బీసీసీఐకి అందించారు. అలా క్రికెట్ పట్ల తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అప్పటినుంచి బీసీసీఐ తరపున లతా మంగేష్కర్ కోసం ఇండియన్ స్టేడియం లో రెండు సీట్లను కచ్చితంగా ఖాళీగా ఉంచుతున్నారు. ఇండియన్ జట్టు ఎప్పుడు ఇండియాలో ఆడినా లతా మంగేష్కర్ కోసం కచ్చితంగా 2 సీట్లు అందుబాటులో ఉంటాయి.


End of Article

You may also like