IND Vs SA: టి20 మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి ఈ విషయాలే కారణమా..? అవేంటంటే?

IND Vs SA: టి20 మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి ఈ విషయాలే కారణమా..? అవేంటంటే?

by Anudeep

Ads

ఇండియాకు, సౌత్ ఆఫ్రికా కు మధ్య టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గట్టి స్కోర్ నమోదు చేసినప్పటికీ ఇండియా ఓడిపోయింది. అంత స్కోర్ ఇచ్చినా ఇండియా ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే.. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఎంచుకున్నారు. దీనితో ఇండియా మొదట బాటింగ్ చేసింది. ఇరవై ఓవర్లకు గాను 211/4 స్కోర్ నమోదు చేసారు. తర్వాత బాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 212/3 స్కోర్ తో ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది.

panth 1

31 బంతుల్లో 64 పరుగులు చేసి నాట్ అవుట్ గా మిగిలిన  డేవిడ్‌ మిల్లర్‌ ఈ మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. భారత్ ఓటమికి ప్రధాన కారణం.. మొదటగా బాగా స్కోర్ చేసిన భారత్ జట్టు తరువాత ప్రణాలికను అమలు పరుచుకోవడంలో విఫలమైంది. దక్షిణాఫ్రికా కు చెందిన మిల్లర్‌, వాన్‌డెర్‌ డసెన్‌ బాగా బాటింగ్ చేసారు. మిల్లర్ ను కట్టడి చేయడానికి పంత్ జట్టు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

panth 2

ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ స్లోగా నడిచిందని.. సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని పంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. తమ ప్రదర్శన పట్ల తాము సంతృప్తికరంగానే ఉన్నామని.. అయితే.. మరో మ్యాచ్ లో మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని పంత్ పేర్కొన్నారు.


End of Article

You may also like