11 మంది కెప్టెన్ల సారధ్యంలో ఆడిన ఒకే ఒక్క భారత ఆటగాడు ఎవరో తెలుసా.?

11 మంది కెప్టెన్ల సారధ్యంలో ఆడిన ఒకే ఒక్క భారత ఆటగాడు ఎవరో తెలుసా.?

by Anudeep

Ads

దినేష్ కార్తీక్.. ఐపీఎల్ 2022 లో అద్భుత ఆట తీరు కనబర్చిన ఆర్సీబీ ఆటగాడు. అనేక క్లిష్ట సమయాల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాల్ని అందించాడు. ఈ ఐపీల్ సీజన్ లో 57.4 యావరేజ్, 191.33 స్ట్రైక్ రేట్ తో అందరిని ఆకట్టుకున్నాడు. మరోసారి తను ఎంత విలువైన ఆటగాడో బీసీసీఐ కి అర్థమయ్యేలా చేసాడు.

Video Advertisement

ఐపీఎల్ అనంతరం జరుగుతున్నా సౌత్ ఆఫ్రికా, ఇండియా సిరీస్ తో టీం ఇండియాకు రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తానెంటో నిరూపించుకుంటున్నాడు వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దాదాపుగా క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందన్న దశలో తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు దినేష్.. అయితే అంతర్జాతీయ కెరీర్‌లో ఏకంగా 10 మంది భారత కెప్టెన్ల సారధ్యంలో ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాడు డీకే. అంతర్జాతీయ స్థాయిలో ఓ ఆటగాడు ఇంత మంది కెప్టెన్ల సారధ్యంలో ఆడిన ఆటగాళ్లు ఎవరు లేరు.  ఐసీసీ ఈవెంట్లతో కూడా కలుపుకుంటే దినేష్ కార్తీక్ కెప్టెన్ల సంఖ్య 11కు చేరుతుంది. కార్తీక్‌ పాక్‌ దిగ్గజ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది నాయకత్వంలో ఐసీసీ ఎలెవెన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇటీవలే 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కార్తీక్‌ త్వరలో అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్ల సంఖ్యను 12కు పెంచబోతున్నాడు. దినేష్.. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్‌ పర్యటనలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. 18 ఏళ్ల క్రితం 2004లో తొలిసారి టీమిండియాలో అడుగుపెట్టిన కార్తీక్‌.. తన అరంగేట్రం మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌, ఎమ్మెస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్‌ల కెప్టెన్సీల్లో టీమిండియాకు సేవలందించాడు.

Also Read : 


End of Article

You may also like