Ads
దినేశ్ కార్తీక్ ప్రస్తుతం టీమిండియాలో వెటరన్ ఆటగాడు. వయస్సులో పెద్దోడే కానీ యువకులతో పోటీపడి మరీ ఆడుతున్నాడు. దాదాపు ఫేడ్ ఔట్ అయిన దగ్గర నుంచి.. టీమిండియా ప్రస్తుత బెస్ట్ ఫినిషర్‌గా ఎదిగాడు.
Video Advertisement
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ ఐపీఎల్ ఫామ్ ను కంటిన్యూ చేసి ప్రపంచకప్ టీమ్ లో చోటును దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఒక్కసారిగా ఇండియన్ క్రికెట్ లవర్స్ కి దినేష్ ఫెవరేట్ ప్లేయర్ అయిపోయాడు. కార్తీక్ సక్సెస్ ను చూసి అతడి మాజీ ఫ్రెండ్ మురళీ విజయ్ కూడా కార్తీక్ రూట్లో నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు క్రికెట్ కు దూరంగా ఉన్న విజయ్. 38 ఏళ్ల వయసులో తాజాగా ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
వీలైనంత కాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. అందుకోసమే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యానని విజయ్ పేర్కొన్నాడు. ఈ లీగ్ లోని రూబీ ట్రిచీ వారియర్స్ తరఫున విజయ్ ఆడనున్నాడు. 2008లో టీమిండియా తరఫున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్.. తన చివరి మ్యాచ్ ను 2018లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతర కొన్నాళ్ల పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
మురళి విజయ్.. దినేష్ మొదటి భార్య నికితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రికెట్ లోకి మళ్లీ ఎంటర్ అవ్వడంతో ‘అందరూ కార్తీక్ కాకాలు కాలేరబ్బా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
End of Article