Ads
భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోనీ ఒకడు. ఇండియాకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు మహేంద్రసింగ్ ధోని. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు.
Video Advertisement
కెరీర్ ఆరంభంలో హెలికాప్టర్ షాట్‌తో అభిమానులను అలరించిన మహీ.. కెప్టెన్ అయ్యాక ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఆలోచిస్తూ మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించాడు. అయితే కెప్టెన్‌గా మారిన తర్వాత కోడ్ లాంగ్వేజ్‌ని విపరీతంగా వాడేవాడట మహీ. వికెట్ల వెనకాలే కాకుండా బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుకి తెలియకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్ పంపేందుకు కొన్ని కోడ్ లాంగ్వేజ్‌లను వాడేవాడట.
2008లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో ఆసీస్‌తో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్‌గా ధోనీకి ఇది ఐదో వన్డే మాత్రమే. లక్ష్యఛేదనలో టీమిండియా 10 పరుగుల దూరంలో నిలిచిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్లవ్స్ కోరుతూ సిగ్నల్ పంపించాడు క్రీజులో ఉన్న ధోనీ. అప్పటికే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేస్తున్నా.. ధోనీ గ్లవ్స్ కావాలని మెసేజ్ పంపడంతో భారత జట్టు షాక్ అయ్యిందట.
నిజానికి మాహీ మ్యాచ్ అయిపోయే సమయంలో గ్లవ్స్ అడిగాడంటే దానికి అర్థం.. మ్యాచ్ అయ్యాక, ఎవ్వరూ బాల్కనీలో సెలబ్రేట్ చేసుకోకూడదు. ఆస్ట్రేలియాపై విజయాన్ని పెద్దదిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ధోనీ ఇలా సూచించాడట. క్రీజులో ఉన్న రోహిత్ కి కూడా మ్యాచ్ అయ్యాక వాళ్లు షేక్ హ్యాండ్ ఇస్తే.. ఊరికే అలా ఫార్మల్‌గా చేతులు కలుపు. అంతేకానీ గెలిచాం కదా అని సెలబ్రేట్ చేసుకోకు. ఎలాంటి ఆనందం లేనట్టే ఉండు అని సూచించాడట.
మాహీ ఇలా ఎందుకు చేశాడనే విషయం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న చాలా మందికి అర్థం కాలేదు. అప్పటికే మూడు వరల్డ్ కప్స్ గెలిచిన ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఆస్ట్రేలియాపై విజయం సాధించడం పెద్ద గొప్పేమీ కాదని, ఇకపై ఇలాంటి విజయాలు వరుసగా వస్తూనే ఉంటాయనే మెసేజ్ ఇచ్చేందుకు మాహీ అలా చేశాడు.
కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ ఎంత మెచ్యూర్డ్ ఆలోచించేవాడో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలంటాడు ధోనీపై ‘ది ధోనీ టచ్’ పుస్తకం రాసిన భరత్ సుందరేశన్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కాకుండా వికెట్ కీపింగ్ సమయంలోనూ ఎమ్మెస్ ధోనీ కోడ్ లాంగ్వేజ్‌ని బాగా వాడేవడట. ఇది ఆ బౌలర్‌కి, కెప్టెన్ ధోనీకి తప్ప కొంతమంది ఫీల్డర్లకు కూడా అర్థం కాదట.
End of Article