Home Bigg Boss 6 telugu “40 కేజీల నగలు… 20 బీరువాల బట్టలు..!” అంటూ… తన గురించి చెప్పిన నేహా చౌదరి..!

“40 కేజీల నగలు… 20 బీరువాల బట్టలు..!” అంటూ… తన గురించి చెప్పిన నేహా చౌదరి..!

by Anudeep

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన స్పోర్ట్స్ యాంకర్ నేహా చౌదరి చాలా సెటిల్డ్ గా ఆడుతూ గేమ్ పై ఫోకస్ పెట్టింది. మహా న్యూస్‌లో యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసింది నేహా చౌదరి. తల్లి కబడ్డీ , కోకో ప్లేయర్ కావడంతో చిన్నప్పటి నుంచి స్పోర్స్ట్ వైపు ఇంట్రస్ట్ చూపించింది నేహా చౌదరి.

ఐపీయల్ తెలుగు వచ్సినప్పటి నుంచి నేహా క్రీడాభిమానులు సుపరిచితురాలు.అంతే కాకుండా నేహా జిమ్నాస్టిక్స్‌లో నేషనల్ ఛాంపియన్.. 26 మెడల్స్ సాధించింది. స్టేట్ లెవల్‌లో స్విమ్మర్.. జిమ్ ట్రైనర్.. యోగా ట్రైనర్.. మోడల్.. గూగుల్‌లో పని చేసిన ఇంజనీర్.. డాన్సర్.. యాంకర్ ఇలా అన్నింటా తనను తాను నిరూపించుకుంది నేహా.

anchor neha about her parents

తనని తాను బిగ్ బాస్ స్క్రీన్‌పై చూసుకోవాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేహా చౌదరి చివరికి బిగ్ బాస్ హౌస్‌లో కనిపించింది.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నేహా.. తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

anchor neha about her parents

తనకు ఈ ప్రపంచంలో అమ్మ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అన్న నేహా వారి పేర్లు టాటూ వేయించుకుంది. వారి తర్వాత తన ఇల్లు అంటే ఇష్టం అని చెప్తూ కాలిపై వేయించుకున్న ఇంటి టాటూని చూపించింది నేహా చౌదరి. తమ బంధువులంతా ఫారెన్ లో సెటిల్ అయితే తానూ మాత్రం స్పోర్ట్స్ పై ఇంటరెస్ట్ తో ఇలా ఇటు వైపు వచ్చానని చెప్పింది నేహా.

anchor neha about her parents

ఒక్కోసారి తన ఈఎంఐలు కూడా తన తెల్ల కడుతుందని చెప్పుకొచ్చారు ఈ ఫిట్నెస్ ఫ్రీక్. తానూ సంపాదించిందంతా మోడలింగ్ కోసం ఖర్చు పెడతానని చెప్పారామె. ఇప్పటివరకూ తన దగ్గర.. 40 కేజీల జ్యువెలరీ.. 20 బీరువాల బట్టలు.. 200 జతల చెప్పులు ఉన్నాయని.. ఇదే నా ఆస్తి అని చెప్తుంది నేహా.

anchor neha about her parents
పెళ్లి చేసుకోవాలి.. లేదంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి అనే కండిషన్ మీద హౌస్లోకి అడుగుపెట్టిన నేహా తనకు ఇప్పటివరకు ఒక్క ప్రపోసల్ కూడా రాలేదని చెప్పారు. తన పెళ్లి నిర్ణయం మాత్రం తన తల్లితండ్రులదే అని చెప్పారు నేహా చౌదరి.

You may also like