Ads
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సీరియల్‌లో.. ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. మోనిత ఎత్తులకు పైఎత్తులు వేసి దీపను చిత్తుచిత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ క్రమంలోనే మోనిత మరో కుట్రకు సిద్ధమైంది. అయితే నేటి కథనంలో దీపకు మంచే జరిగింది. మరోవైపు దీప, సౌర్య ఫోన్‌లో మాట్లాడుకోవడంతో కథనం ఉత్కంఠగా మారింది.ఇక ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం…మోనిత ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు రావడం.. ‘మీ భర్తకు గతం గుర్తు రావడానికి మా దగ్గర వనమూలికలతో కూడిన మందు ఉంది.. మీరు మీ భర్తకోసం వాడతారా’ అని అడుగుతారు. అది దీప విని ఆగుతుంది.
‘మీరు డబ్బులు కోసం ఇలాంటివన్నీ చెబుతారని నాకు తెలుసులే.. అయినా గతం గుర్తు చేసే ఏ మందులు మాకొద్దు’ అనేసి వాళ్లని పంపించేస్తుంది మోనిత. అంతా విన్న దీప.. ఆ ఆడవాళ్లని ఆపి.. ఆరా తీస్తుంది. ‘నా భర్త గతం మరచిపోయారు.. ఆయన మందు తీసుకోవడానికి అందుబాటులో లేరు. కానీ నేను ఆయనకోసం ఆ మందు తీసుకోవచ్చా?’ అంటుంది దీప. కచ్చితంగా తీసుకెళ్లొచ్చు కానీ ఆ మందుకి సూర్యకిరణాలు తగిలితే దాని శక్తిని కోల్పోతుంది. కనుక మీరు ఈరోజు రాత్రికి వచ్చి, రేపు రాత్రి వరకు ఉండి మళ్ళీ రేపు రాత్రి బయలుదేరాలి.
అయినా కంగారు ఏమీ లేదు, మీరు అందర్నీ కనుక్కొని బయలుదేరండి అని వాళ్ళు అంటారు. అప్పుడు దీప వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరిగెట్టి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్లతో మాట్లాడుతారు. వివరాలన్నీ కనుక్కున్న తర్వాత, ఆయుర్వేదం కద అమ్మ,ఇలాంటి విషయాలకు మంచిదే. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని ఈరోజు రాత్రికి బయలుదేరు అని సలహా ఇస్తాడు.
మరోవైపు మోనిత కార్తీక్‌కి టాబ్లెట్స్ వేసి.. ‘ఎలా ఉంది కార్తీక్’ అంటుంది మోనిత. ‘హా టాబ్లెట్స్ వేసుకున్నాను కదా.. బాగానే ఉంది..’ అంటాడు కార్తీక్. వెంటనే మోనిత ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ‘బిడ్డని పోగొట్టుకుని.. నువ్వే బిడ్డగా బతుకుతున్నాను.. నీకు ఏదైనా అయితే నేను ఏం అయిపోతాను కార్తీక్? నువ్వు మాటి మాటికీ గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించకు.. ఎక్కువగా ఆలోచించకు.. నీకు నేను ఉన్నాను కదా.. రేపు మన బాబు వచ్చాక.. సంతోషం గా ఉందాం.. ఇంతకన్నా మనకి ఏం కావాలి చెప్పు’ అంటూ ఏడుస్తుంది.
దాంతో కార్తీక్.. ‘అవును మన బాబు చెన్నైలో ఉన్నాడు అన్నావ్ కదా? తీసుకొస్తాను అన్నావ్? ఎప్పుడు తీసుకొస్తావ్’ అంటాడు. ‘తీసుకొస్తాను కార్తీక్.. నువ్వు మాత్రం గతం గుర్తు చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు’ అంటూ సర్దిచెబుతుంది. అప్పుడు కార్తీక్, నేను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించట్లేదు అదే గుర్తొస్తుంది కానీ చాలా అస్పష్టంగా, ఏది తెలియడం లేదు. ఆ తర్వాత సీన్లో మోనిత,దీప ఇంటి ఎదురుగుండా వచ్చి, అయ్యో దీపక్క ఎవరో వచ్చి గతం గుర్తు చేస్తాను అని అంటే ఎలా నమ్మి బయలుదేరుతున్నావు, ఈ రెండు రోజులు నువ్వు ఆ ఊర్లో ఉంటావ్, నేను హాయిగా ఆనంద్ ని తీసుకొని వస్తాను.పాపం అమాయకురాలు ఏం చెప్తే అది నమ్మేస్తావు అని అనుకుంటుంది.
ఇంతలో దీప ఇంటికి తాళం వేసి బాగ్ సద్దుకుని వస్తుంది. ఏంటి దీప ఎక్కడికి వెళ్తున్నావు? అని అడగగా డాక్టర్ బాబుకి గతం గుర్తొస్తుందిలే వారంలో అప్పుడు మాట్లాడుకుందామని అంటుంది దీప. అంత నమ్మకంగా ఉన్నావేంటి కొంపతీసి ఇందాక వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా అని అడగగా, ఏం.. డాక్టర్ బాబు కి గతం గుర్తొస్తుందని భయపడుతున్నావా అని అంటుంది దీప. సరే నీ ప్రయత్నం నువ్వు చేస్కో ఆల్ ద బెస్ట్ అని దీప ని పంపిస్తుంది మోనిత.
దీప వెళ్ళిపోయిన తర్వాత,నువ్వు ఇలాంటి విషయాలు నమ్ముతావని నేను అసలు అనుకోలేదు అక్కా.. చూస్తే జాలేస్తుంది అని అనుకుంటుంది. అంత తెలివైన దాన్ని.. ఇంత తెలివైనదాన్ని అంటావ్.. మరీ ఇంత ఈజీగా ఫూల్ అయ్యావేంటీ? వంటలక్కా.. నువ్వు తిరిగి వచ్చేలోగా నేను వెళ్లి ఆనంద్‌తో తిరిగి వచ్చేస్తాను’ అనుకుంటుంది. తర్వాత దీప..శౌర్య వాళ్ళ బాబాయ్ ఆటోని చూస్తుంది. వెనక అమ్మానాన్న ఎక్కడున్నారు అని ఉంటుంది.
అప్పుడు దీపకి, శౌర్య “అమ్మ త్వరగా రా” అని ఆటో వెనక ఒకప్పుడు రాసిన సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు అదే సమయంలో శౌర్య,వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి పిన్ని కొన్ని సరుకులు తీసుకురమ్మని చెప్పింది రాసుకో అని అంటుంది. నీ గొంతు మారిపోయింది జ్వాలా.ఇంకా జలుబు తగ్గినట్టు లేదు మందులు తెస్తాను అని ఆ లిస్టు సరుకులు లిస్ట్ చెప్పు అని అనగా దీప, నేను రాస్తాను లెండి మీరు ఆటో తీయండి అని అంటుంది.
వెంటనే ‘హలో.. చెప్పమ్మా’ అంటుంది దీప. పక్కనే సౌండ్ వల్ల.. దీపకు శౌర్య మాట సరిగా అర్థం కాదు.. కానీ.. దీప మాట్లాడుతుంటే సౌర్యకు మాత్రం తన తల్లి మాట్లాడుతున్నట్లే ఉందనిపిస్తుంది. ‘అమ్మా పక్కనే సౌండ్స్.. నాకు కొంచెం గట్టిగా చెప్పు రాసుకుంటా’ అంటుంది దీప శౌర్యతో. ‘సరే అమ్మా’ అంటూ కావాల్సిన సరుకులన్నీ చెబుతుంది. ‘సరే అమ్మా రాసుకున్నాను..’ అని పోన్ పెట్టేస్తుంది దీప.
ఇంతలో బస్టాండ్ వస్తుంది.అప్పుడు శౌర్య వాళ్ళ బాబాయ్,ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా, ఇక్కడ పలానా ఊర్లో ఒక వైద్యశాల ఉన్నదట కదా.. అక్కడికి వైద్యం కోసం వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు సౌర్య వాళ్ళ బాబాయ్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఉన్నారు. మీరు చెప్తున్న ఊరు మా సొంత ఊరే, అక్కడ అలాంటివి ఏమీ లేవు అదంతా కొండల ప్రాంతం అని అంటాడు. అప్పుడు దీప మనసులో, మోనిత ఏమైనా ప్లాన్ చేసిందా? అయినా ఇందాక నాతో అంత ధైర్యంగా మాట్లాడిందంటే దాని పనే అయి ఉంటుంది.
రెండు రోజుల నన్ను బయటకు పంపి, డాక్టర్ బాబు నీ ఏం చేద్దామనుకుంటుంది అని అనుకుంటుంది దీప. ఇంద్రుడు కాస్త దూరం వెళ్లేసరికి.. శౌర్య మళ్లీ కాల్ చేస్తుంది. ‘బాబాయ్ ఇందాక ఫోన్‌లో మాట్లాడింది ఎవరు? ఒకసారి ఆవిడి ఫొటో పంపించు బాబాయ్..’ అంటుంది. ‘లేదమ్మా దిగిపోయింది.. అయినా ఆవిడ ఫొటో ఎందుకు తల్లీ’ అంటాడు ఇంద్రుడు. ‘గొంతు వింటే మా అమ్మ గొంతులానే అనిపించింది బాబాయ్..’ అంటుంది శౌర్య ఎమోషనల్‌గా.. ‘అమ్మా చాలామంది గొంతులు ఒకేలా ఉంటాయి. ఆవిడ మీ అమ్మ అయితే మీ కోసం వెతకాలి కానీ.. తన భర్తకు బాలేదని ఆశ్రమానికి మందు కోసం వెళ్తోంది.
అలాంటప్పుడు ఆవిడ కచ్చితంగా మీ అమ్మ కాదమ్మా.. అయినా ఆవిడ్ని ఒకసారి చూశాను కాబట్టి.. ఈసారి కనిపిస్తే కచ్చితంగా ఫొటో తీసుకుంటా’ అనేని ఫోన్ కట్ చేస్తాడు ఇంద్రుడు. ఆ తర్వాత సీన్లో దీప పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ, అన్నయ్యల ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కంగారుగా అక్కడికి వెళ్లలేదా దీపా అని అడగగా, వైద్యం లేదు ఏదీ లేదు అదంతా కొండల ప్రాంతం అంట.ఇదంతా మోనిత ప్లాన్ అని దీప అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
End of Article