Home Bigg Boss 6 telugu బిగ్‌బాస్ తెలుగు -6 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..??

బిగ్‌బాస్ తెలుగు -6 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..??

by Anudeep

బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కంటెస్టెంట్స్ నే కాదు, ఆడియన్స్ ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. కాన్సెప్టు కొత్తగానే ఉన్నా.. రికార్డుల మీద రికార్డులు కొట్టేంత ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్.

కంటెంట్ ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీనికి ఉదాహరణే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంటే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందివ్వడంతో దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ మంచి ఆదరణను అందుకుంటోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్టార్ట్ అయ్యి రెండు వారాలు గడవక ముందే సీజన్ విన్నర్ ఎవరు అంటూ ఇప్పటికే ఒక రసవత్తరమైన చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో. ప్రతిసారి కూడా కంటెస్టెంట్ ఆట తీరును గమనించి ఎవరు విజేతలు అవుతారు, ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అనేది ముందుగానే ఒక అవగాహనకు వస్తారు ప్రేక్షకులు.

who become the bigboss 6 winner
కానీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కేవలం ఆడుతుంది ఒకరిద్దరూ మాత్రమే. అందుకే విన్నర్ ఎవరో కూడా ముందుగానే ఊహించేస్తున్నారు.అయితే అందరిని నోళ్ళలో ప్రస్తుతం నానుతున్న పేరు గీతు రాయల్.

who become the bigboss 6 winner
కేవలం రెండు వారాల్లోనే గీతు పేరు ఎక్కువగా వినిపించడానికి కారణాలు లేకపోలేదు.ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు ఆడాలన్న ఉత్సాహం లేకపోవడమే గీతు పేరు ఎక్కువగా వినిపించడానికి గల ముఖ్యమైన కారణం.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గీతు అంటే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.బయట ఎలా ఉంటామో ఇంట్లో కూడా అలాగే ఉండాలనే గీతు సిద్ధాంతం కూడా అందరికీ నచ్చినట్టుగా కనిపిస్తుంది.

who become the bigboss 6 winner
అంతేకాదు మొదటి వారంలో ఖచ్చితం గా ఎలిమినేషన్ అవుతుంది అనుకున్న గీతు రెండో వారానికి బెస్ట్ పెర్ఫార్మర్ గా సాగడానికి ఆమెను ఆమె మలుచుకున్న విధానం కూడా ఒక కారణం కావచ్చు..
మరో వైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న సింగర్ రేవంత్, నటుడు బాలాదిత్య అంతగా ఆడకపోయేసరికి ప్రేక్షకులు నిరుత్సాహ పడుతున్నారు.

who become the bigboss 6 winner
అయితే కేవలం రెండు వారాల ఆటతో గీతుని ఫైనల్ కంటెస్టెంట్ అనడం కూడా కరెక్ట్ కాదని ఒక వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు ఎవరు విన్నర్ అయినా కూడా గీతు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటుందనేది మరొక వాదన.

You may also like