బిగ్ బాస్ తెలుగు-6 పై జనాలతో పాటు వాళ్లకి కూడా ఆసక్తి తగ్గుతోందా..??

బిగ్ బాస్ తెలుగు-6 పై జనాలతో పాటు వాళ్లకి కూడా ఆసక్తి తగ్గుతోందా..??

by Anudeep

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.

Video Advertisement

తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది. వరుసగా నాగార్జున నాలుగోసారి హోస్ట్ చేసిన సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది. సెప్టెంబర్ 4 ఆదివారం నాటి బిగ్ బాస్ సీజన్ 6 లాంఛింగ్ ఎపిసోడ్ కేవ‌లం కేవలం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించింది. గత ఆరు సీజ‌న్స్‌లో లాంఛింగ్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ రేటింగ్ ఇదే అన్న విషయం తెల్సిందే.

audience loosing interest on biggboss 6..??
ఇంత దారుణమైన వైఫల్యానికి బలమైన కారణమే ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్‌ రోజు ఇండియా-పాకిస్థాన్ క్వాలిఫై మ్యాచ్. ఆసియా కప్‌లో కీలకమైన మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తుండగా.. సరిగ్గా అదే రోజు బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యింది. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ముందు బిగ్ బాస్ తేలిపోయింది.

audience loosing interest on biggboss 6..??
పోనీ కంటెస్టెంట్స్‌ని చూసి అయినా బిగ్ బాస్ వైపు మొగ్గుచూపుతారా అంటే అవన్నీ కొత్త, తెరమరుగైన ముఖాలు.. మరికొంతమంది సోషల్ మీడియా రోత బ్యాచ్. దీంతో బిగ్ బాస్ షోని దూరం పెట్టారు ప్రేక్షకులు. ఈ కారణంతో బిగ్ బాస్ సీజన్ 6కి ఘోరమైన రేటింగ్ వచ్చింది.
అయితే నామినేష‌న్స్ , ఎలిమినేష‌న్స్ ప్ర‌క్రియ‌ల‌తో బిగ్ బాస్ సీజ‌న్ 6 రోజు రోజుకు అంచ‌నాలు పెంచే దిశ‌గా ముందుకెళ్లే ఛాన్స్ ఉందని ఆశించారు ప్రేక్షకులు. రాబోయే రోజుల్లో రేటింగ్ విష‌యంలో కూడా అంచ‌నాల‌ను అందుకుంటుంద‌ని బిగ్ బాస్ షో ల‌వ‌ర్స్ ధీమా వ్య‌క్తం చేసారు.

audience loosing interest on biggboss 6..??
కానీ షో పరిస్థితిలో ఏ మార్పు లేదు. హోస్ట్ నాగార్జున సైతం పేలవమైన యాంకరింగ్ తో పెద్దగా షో పై బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు.మా డబ్బులు మాకు వస్తే చాలు ఆట ఎలా ఉంటె ఏంటి అన్నట్టుగా ఇంటి సభ్యుల బిహేవియర్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కూడా ఎంతో కొంత మార్పులు చేర్పులు జరిగితే షో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్ళచ్చు. కానీ అసలు బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా షో పైన ఇంట్రెస్ట్ పోయిందా ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి.

audience loosing interest on biggboss 6..??
అగ్రిమెంట్ చేసుకున్న బ్రాండ్స్ పోయిన, టిఆర్ పి రేటింగ్ రాకపోయినా ఏం పర్వాలేదు అన్నట్టుగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు.ఒక సీజన్ లో వచ్చిన బ్రాండ్స్ మరో సీజన్ లో లేకపోతుంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే ఫైనల్ గా పోయేది హోస్ట్ నాగార్జున పరువే కాబట్టి అక్కినేని ఫాన్స్ కాస్త హడావిడి చేస్తున్నారు.


End of Article

You may also like