నాగార్జున పక్షపాతం చూపిస్తున్నారా..??

నాగార్జున పక్షపాతం చూపిస్తున్నారా..??

by Anudeep

Ads

బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఫేవరిజమ్ చూపిస్తున్నారా? తనకి నచ్చిన వాళ్లని ముఖ్యంగా అమ్మాయిల్లో కొంతమందికి హైప్ ఇస్తూ.. మిగిలిన వాళ్లని బ్యాడ్ చేసేట్టుగా హోస్ట్ చేస్తున్నారా? అంటే ఔననే అంటోంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నేహా చౌదరి.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కొంతమందికి ప్లస్ అయితే చాలామందికి మైనస్ అవుతోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది కంటెస్టెంట్లు ఈ షో తమకు మైనస్ అయిందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Video Advertisement

anchor neha chowdary shocking comments about biggboss
మూడోవారం నామినేషన్స్‌లో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది నేహా చౌదరి. అయితే ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ గొంతెత్తింది నేహా. మరో వైపు ఆమె అభిమానులు కూడా అదే మాట అంటున్నారు.

anchor neha chowdary shocking comments about biggboss
ఈ నేపథ్యం లో నేహా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను ఎలిమినేట్ అయ్యానంటే చాలామంది నమ్మడం లేదు.. అన్ ఫెయిర్ అంటున్నారు.. టాప్ 2 వరకూ ఉంటాననే అనుకున్నారు. అసలు కంటెంట్ ఇవ్వని వాళ్లు హౌస్‌లోనే ఉన్నారు. వానీ.. వాసంతి దగ్గర నుంచి కంటెంట్ వస్తున్నదే లేదు. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో బ్యూటీగా మాత్రమే ఉంది. గ్లామర్ డాల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఉంది.

anchor neha chowdary shocking comments about biggboss

ఇక ఇనయ విషయంలో వారం మొత్తం రాంగ్‌గానే మాట్లాడారు. కానీ వీకెండ్‌లో నాగార్జున గారు వచ్చి నా వెర్షన్ తీసుకుని మొత్తం రివర్స్ చేసేశారు. నిజంగానే నాది మిస్టేక్ ఉండి ఉంటే.. జరిగిన రోజు ఎపిసోడ్‌లో ఎందుకు హైలైట్ కాలేదు.. ఆ తరువాతి ఎపిసోడ్‌లో ఎందుకు హైలైట్ కాలేదు.ఎందుకంటే నన్నుఎలిమినేట్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి.. నన్ను బ్యాడ్ చేయడానికి నాగార్జున గారు ఆ పాయింట్‌ని తీసుకుని వచ్చారు.

anchor neha chowdary shocking comments about biggboss

ఈ సీజన్‌లో నాగార్జున గారు ఫెయిర్‌గా జడ్జ్ చేయడం లేదనే టాక్‌పై నేను కామెంట్ చేయదల్చుకోలేదు కానీ ఒకరిద్దరు కంటెస్టెంట్స్‌ని కావాలని హైప్ చేస్తున్నారని నాకు కూడా అనిపించింది. ఎందుకిలా చేస్తున్నారనే డౌట్ నాకే కాదు.. హౌస్‌లో ఉన్న వాళ్లకి కూడా చాలాసార్లు అనిపించింది.” అంటూ చెప్పుకొచ్చింది నేహా చౌదరి.


End of Article

You may also like