Ads
బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఈ రోజు తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ 1482 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య, గండ, చంద్ర వాళ్ళ అమ్మానాన్నల గురించి మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
Video Advertisement
సౌర్య, ఇంద్రుడు.. చంద్రమ్మను కలుస్తారు. ‘జ్వాల వాళ్ల అమ్మగారు.. మనం వెతికే ఆవిడ ఒకరు కాదు’ అంటాడు ఇంద్రుడు. ‘అయ్యో.. ఆశపుట్టింది గండా.. జ్వాలమ్మ వాళ్ల అమ్మే అయ్యి ఉంటే బాగుండేదిగా’ అంటుంది చంద్రమ్మ నిరాశగా. ‘కాకపోయినా నిజం తెలిసింది పిన్నీ.. అమ్మా నాన్న బతికే ఉన్నారు అని ఆ మోనిత ఆంటీ ద్వారానే అర్థమైంది. నేను హైదరాబాద్ వెళ్లిపోవాలని అలా చెప్పింది.. అమ్మానాన్నల్ని మళ్లీ వెతుకుతా..’ అంటుంది సౌర్య కోపంగా. ‘సరేలే తల్లీ జాతర అయిపోయిందిగా ఇంటికి పోదామా?’ అంటాడు ఇంద్రుడు. ‘పోదాం బాబాయ్.. ఒక్క..సారి.. ఆ మోనిత ఆంటీని పలకరించి వస్తా ఉండండి’ అంటుంది సౌర్య కసిగా.
కట్ చేస్తే వారణాసి కార్తీక్ కి అంతా చెప్తూ ఉంటాడు. కార్తీక్ గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వారణాసి మీరు గతం మర్చిపోవడం ఏంటి డాక్టర్ బాబు అంటూ.. అందుకే మాకు మీరు బ్రతికున్న ఈ ఆచూకీ లేకుండా పోయింది. మీకోసం అమ్మగారు, అయ్యగారు ఎంత ఏడ్చారో తెలుసా.. ఇక సౌర్యమ్మ అయితే పిచ్చిదానిలా తిరుగుతుంది. అవును దీపక్క బతికే ఉందా ఎక్కడుంది అని అడుగుతూ ఉండగా… కార్తీక్ దీపని గతంలో గుర్తు చేసుకుంటూ అంటే వంటలక్కే కదా ఉంది నేనే తన భర్త అని మొరపెట్టుకుంటూ నాకోసమే తపిస్తోంది. దీప నా భార్య అయితే నేను పెద్ద తప్పు చేసినట్టే. అంటూ ఉంటాడు. అప్పుడు వారణాసిని దీపమ్మని అవమానించారా.. తను మీకోసం ఎన్ని కష్టాలు పడిందో అని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు.
‘ఇంతకీ దీపక్క ఏమైంది డాక్టర్ బాబు’ అంటాడు వారణాసి అనుమానంగా ఏడుస్తూ. వెంటనే పైకిలేచిన కార్తీక్ దీప.. దీప.. ‘ఇ..ఇక్కడే ఉంది..’ అంటాడు కార్తీక్. ‘ఎక్కడుంది డాక్టర్ బాబు ఎక్కడుంది?’ అంటాడు వారణాసి ఏడుస్తూ. ఇంతలో దీప కార్తీక్‌ని వెతుక్కుంటూ మోనిత మాట నమ్మి.. అటు వైపే వస్తూ ఉంటుంది. రౌడీలు దీప కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ‘దీపక్క ఎక్కడుందో చెప్పండి డాక్టర్ బాబు’ అంటాడు వారణాసి గట్టిగా కార్తీక్‌తో.
అప్పుడు వారణాసి నిజంగా దీపక్క మీ భార్య బాబు కావాలంటే నా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయని చెప్తాడు. అప్పటికే గత జ్ఞాపకాలతో సతమతం అవుతూ.. తలనొప్పిగా ఉంది.. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్.. అని వారణాసిని అక్కడ నుంచి పంపించేస్తాడు డాక్టర్ బాబు. అలా అక్కడి నుంచి బయటికి వచ్చిన వారణాసికి దూరంగా దీప వెళ్లడం కనిపిస్తుంది. అయితే మధ్యలో ఆమెని దుండగులు వెంబడించడం చూస్తాడు.
దీపని పిలిచినా వినిపించుకోకపోవడంతో ఆ దుండగులను తానే అడ్డుకుంటాడు. ఆ క్రమంలో వాళ్ల చేతిలో దెబ్బలు తిని స్పృహ కోల్పోతాడు. ఆ అరుపులు విని అక్కడికి వచ్చిన డాక్టర్ బాబు వాళ్ళని తరిమి కొడతాడు. స్పృహ తప్పి పడి ఉన్న వారణాసిని లేపడానికి ప్రయత్నిస్తాడు.
ఈ లోపు శౌర్య మోనితని చూసి, నన్నే తిడతావా ఉండు నీ పని చెప్తాను అని అక్కడే ఉన్న మోనిత మీదికి రాయి విసురుతుంది. అది గమనించిన మోనిత పక్కకు తప్పుకుంటుంది. ఆ రాయి నేరుగా వెళ్లి డాక్టర్ బాబుకు తగులుతుంది. ఆ దెబ్బకి అతనికి పూర్తిగా గతం గుర్తుకు వస్తుంది జరిగిన అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. పూర్తిగా గతం గుర్తుకు వచ్చిన డాక్టర్ బాబుకి అక్కడే పడి ఉన్న వారణాసి ని గుర్తుపట్టి, వారణాసి ఏమైంది మనం ఎక్కడున్నాం? దీప ఎక్కడ పిల్లలు ఎక్కడ అని అడుగుతాడు. అయితే వారణాసి పలకకపోవటంతో, అక్కడ ఎవరూ లేకపోవడంతో వారణాసిని ఎత్తుకొని హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు.
ఇంతలో పరిగెత్తుకుంటూ అక్కడికి శౌర్య వస్తుంది. బాబాయ్ త్వరగా ఆటో తియ్యి.. అని గాబరా పడుతుంది. ఏమైందమ్మా అంటే నేను మోనిత ని రాయితో గట్టిగా కొట్టాను కానీ అది ఆవిడకి తగల్లేదు. తగిలితే నా కసి తీరి ఉండేది అని అంటుంది. పద బాబాయ్ తర్వాత మోనిత ఆంటీ సంగతి చూద్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మరోవైపు తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని కంగారుగా ఉంటుంది మోనిత. కార్తిక్ కి గతం గుర్తుకు వచ్చి తనని వదిలేస్తాడేమోనని కావేరి కి చెప్పి బాధ పడుతూ ఉంటుంది.
డాక్టర్ బాబు ని వెతుకుతున్న దీపకి వాళ్ళ అన్నయ్య కనిపించి నీకోసమే వెతుకుతున్నాను అమ్మ. ఎక్కడికి వెళ్లిపోయావని అడుగుతాడు. లేదు అన్నయ్య డాక్టర్ బాబు కోసం వెతుకుతున్నాను. ఆ డాక్టర్ బాబు ని ఎక్కడో దాచేసింది.. అడిగితే.. వీధి చివరికి అలా వెళ్ళాడు చెప్తుంది. దాని కళ్ళల్లో డాక్టర్ బాబు కనిపించలేదని బాధ లేదు అని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది మళ్ళీ కనిపించదు అన్నయ్య అని బాధపడుతుంది. ఇక్కడే ఉండి ఏవేవో ఊహించుకోవడం ఎందుకమ్మా ముందుకు ఇంటికి వెళ్దాం ఆ తర్వాత ఏం చేయాలో అని అక్కడ ఆలోచిద్దామని అక్కడి నుంచి బయలుదేరుతారు.
కార్తీక్ వారణాసిని హాస్పిటల్ లో జాయిన్ చేసి తనకి కూడా తలకి కట్టు కట్టించుకుంటాడు. అక్కడనే మీ పేరు ఏమిటి అని అడగ్గా కార్తీక్ అని, తను డాక్టర్ని అని చెప్తాడు. ఫోన్ నెంబర్ మాత్రం గుర్తుకురాదు. అక్కడే ఉన్న డాక్టర్ ను నేను ఒక అతన్ని తీసుకువచ్చాను కదా అతని పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు. అతను చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు సర్జరీ జరుగుతోంది. ఒకవేళ బ్రతికినా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తాడు. మీ పరిస్థితి బానే ఉంది ఈ రాత్రి కి ఇక్కడే ఉంచి రేపొద్దున పంపిస్తాం అని చెప్తాడు. తరువాత ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం…
End of Article